చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సబ్ డివిజనల్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్‌రెడ్డి తన వద్ద పనిచేసే చిరు ఉద్యోగులను కులం పేరుతో అవమానించి, భౌతిక దాడికి పాల్పడిన సంఘటనపై ఆ అధికారి పై వెంటనే సస్పెన్షన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా యూనిట్ డిమాండ్ చేసింది. నంద్యాల జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రప్ప, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆ అధికారి ఆఫీసు సబ్‌ఆర్డినేట్ ఏ. లవ్‌కుమార్, కే. భరత్‌లను కుల వివక్షతో దూషించడం, మానసికంగా వేధించడం, చెప్పులు బయట వదిలి లోపలికి రావాలని ఆదేశించడం ప్రజాస్వామ్యంలో అసహ్యకరమని విమర్శించారు. వెంటనే అధికారిపై షెడ్యూల్ కులాల అథికార రక్షణ చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలుగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి, రవీంద్రనాథ్‌రెడ్డిని తక్షణ సస్పెన్షన్ చేయాలని వారు అధికారులను కోరారు. ప్రభుత్వ పథకాలు అమలుచేస్తున్న ఉద్యోగులు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో, సామాన్య ప్రజల పరిస్థితి ఎంత విషమంగా ఉంటుందో గ్రహించవలసిందిగా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా రాష్ట్ర నాయకత్వం ఆదేశాలనుసారం తదుపరి కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది అని తెలిపారు.

వాణిజ్య పనుల శాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి ని వెంటనే సస్పెండ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్ల అధ్యక్షులు నాగేంద్రప్ప, కోశాధికారి శ్రీనివాసులు డిమాండ్