వాటోలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం- ఐదవ రోజు
గోపాల్ రావు పాటిల్
భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వాటోలి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక శిబిరం ఐదవ రోజు ఆరోగ్య అవగాహన కార్యక్రమం .”గ్రామ ప్రజల అపార స్పందనతో విజయవంతంగా నిర్వహించబడింది.
గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా మధుమేహం, రక్తపోటు పరీక్షలు,సాధారణ, దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న 250 మందికి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.
ఈ సేవలో 10 మంది వైద్యుల బృందం పాల్గొని, మొత్తం లక్ష రూపాయల విలువైన మెడిసిన్స్‌ను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
మెడిసిన్ పంపిణీలో సిపిడిసి సభ్యుడు నిఖిల్ మెడికల్ ప్రత్యేక సహాయం . ల్యాబ్ టెక్నీషియన్స్ బాలాజీ, సాయికుమార్ సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు:
డా. నగేష్, డా. ముత్యంరెడ్డి, డా. మహేష్,
డా. విజయానంద్, డా. చంద్రశేఖర్, డా. వైభవ్,
డా. మనోజ్, డా. ఆకాష్ రెడ్డి తదితరులు గ్రామస్తులను వైద్య పరీక్షలు నిర్వహించి వారికి వివిధ సూచనలు చేసి, మందులను పంపిణీ చేశారు.
మధ్యాహ్నం విద్యార్థుల కోసం న్యాయవాదులు టి గంగాధర్ మాధవి గారు లీగల్ అవేర్నెస్ చట్ట అవగాహన & మోటివేషన్ క్లాస్ నిర్వహించి,
విద్యార్థులు సమాజంలో ఎలా ఉండాలి, చట్టపరమైన అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి కీలక విషయాలను వివరిస్తూ వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా
ప్రిన్సిపాల్ కరోల బుచ్చయ్య గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఉచిత వైద్య సేవలు దగ్గరుండి వారికి ఏ విధంగా పరీక్షలకు చేసుకోవాలని అవగాహన కల్పిస్తూ పలు రకాలుగా తమల సేవలను వినియోగించడం అభినందనీయమని అనంతరం గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ కులపైన అవగాహన కల్పించి ప్లాస్టిక్ వల్ల మానవాళికి ఎటువంటి అపాయం జరుగుతున్నదని ప్రజలకు తెలియజేసి వాటిని వేస్తూ చైతన్యం కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆరె రాజు గారు,
అధ్యాపకులు .డాక్టర్ జే ఓం ప్రకాష్, గుంత సుధాకర్, డా. నహీదా, డా.సంతోష్ కుమార్,
టి. సురేందర్, జి. కిషన్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
🎯 ప్రజల ఆరోగ్యం – విద్యార్థుల చైతన్యం
ఈ రెండు లక్ష్యాలతో ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమం ఘనవిజయం సాధించింది!


