Sunday, 7 December 2025
  • Home  
  • వాటోలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నాలుగో రోజు శివాలయంలో మొక్కలు నాటడం ఆలయం చుట్టూ పిచ్చిమొక్కలు తొలగింపూ వాటోలి గ్రామంలో
- నిర్మల్

వాటోలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నాలుగో రోజు శివాలయంలో మొక్కలు నాటడం ఆలయం చుట్టూ పిచ్చిమొక్కలు తొలగింపూ వాటోలి గ్రామంలో

వాటోలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నాలుగో రోజు శివాలయంలో మొక్కలు నాటడం ఆలయం చుట్టూ పిచ్చిమొక్కలు తొలగింపూ వాటోలి గ్రామంలో గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా, ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ఈరోజుతో విజయవంతంగా నాలుగో రోజును చేరుకుంది. సేవస్ఫూర్తి, పర్యావరణ పరిరక్షణ, యువతలో సామాజిక బాధ్యత పెంపొందించాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ శిబిరంలో వాలంటీర్లు,, అధ్యాపకులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమాలు శివాలయంలో స్వచ్ఛ భారత్, ఆలయ ప్రాంగణంలో చెత్త, మురికి పరిసరాల శుభ్రత, డ్రైనేజీల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సమన్వయంతో నిర్వహించారు. శివాలయం పరిసరాల పర్యావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అనంతరం సుమారు 50 మొక్కలను నాటారు. వీటిలో పూల మొక్కలు, రావిచెట్టు, మర్రిచెట్టు, ఉసిరి చెట్టు తదితర ఔషధ, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలు ఉన్నాయి. ఈ చెట్లు అత్యంత అతీంద్రియ శక్తులను నిలబెట్టే విధంగా ఎంపిక చేయడం విశేషం. కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత విద్యార్థులదేనని, పర్యావరణ పరిరక్షణ మన భవిష్యత్తుతో ముడిపడి ఉందని పలు సూచనలు అందించారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ జి. అర్చన , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆరె రాజు, డాక్టర్ ఓం ప్రకాష్, నిర్మల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధాకర్, డా.గంగాధర్,సుభాష్ , సూర్యసాగర్ సార్, అధ్యాపకులు, కే రఘునాథ్, డాక్టర్ భీమ్రావు, యూ. రవికుమార్, డాక్టర్ పి.జి. రెడ్డి, డాక్టర్ శంకర్, డా, సంతోష్, శ్రావణ్య, హుజమ, తదితరులు పాల్గొని విద్యార్థులకు మానవీయ విలువలను గుర్తు చేశారు. మధ్యాహ్నం అనంతరం నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో డాక్టర్ చంద్రశేఖర్ హెల్త్ & హైజీన్, జీవనశైలి, పోషకాహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం పై ఉపయోగకరమైన సూచనలు ఇచ్చారు. ఆరోగ్యమైన విద్యార్థే ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిస్తాడని ఆయన పేర్కొన్నారు. అలాగే శ్రీ సాయి కుమార్ గారు టాస్క్ జిల్లా మేనేజర్ employability skills గూర్చి విద్యార్థులకు సవివరంగా వివరించారు. ఉద్యోగం సంపాదించడానికి కావలసిన సాఫ్టు స్కిల్స్ వాటికి కావలసిన సామర్థ్యాల సంపాదన గూర్చి వివరించారు. దీనితోపాటు నిఖిల్ చంద్ర రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన కల్పించారు. వ్యక్తిత్వ వికాసం, లక్ష్య సాధన, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ వంటి అంశాలపై ప్రభావవంతమైన ఉపన్యాసం ఇచ్చి వాలంటీర్లలో నూతనోత్సాహాన్ని నింపారు. 📌 గ్రామ ప్రజలు, స్థానిక ప్రతినిధులు, అధ్యాపకులు వాలంటీర్ల సేవాస్ఫూర్తిని అభినందించారు. 📌 పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర మహోన్నతమన్నారూ ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు వారిని సన్మానించారు.

వాటోలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నాలుగో రోజు శివాలయంలో మొక్కలు నాటడం ఆలయం చుట్టూ పిచ్చిమొక్కలు తొలగింపూ వాటోలి గ్రామంలో గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా, ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ఈరోజుతో విజయవంతంగా నాలుగో రోజును చేరుకుంది. సేవస్ఫూర్తి, పర్యావరణ పరిరక్షణ, యువతలో సామాజిక బాధ్యత పెంపొందించాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ శిబిరంలో వాలంటీర్లు,, అధ్యాపకులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈరోజు కార్యక్రమాలు శివాలయంలో స్వచ్ఛ భారత్, ఆలయ ప్రాంగణంలో చెత్త, మురికి పరిసరాల శుభ్రత, డ్రైనేజీల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సమన్వయంతో నిర్వహించారు. శివాలయం పరిసరాల పర్యావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అనంతరం సుమారు 50 మొక్కలను నాటారు. వీటిలో పూల మొక్కలు, రావిచెట్టు, మర్రిచెట్టు, ఉసిరి చెట్టు తదితర ఔషధ, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలు ఉన్నాయి. ఈ చెట్లు అత్యంత అతీంద్రియ శక్తులను నిలబెట్టే విధంగా ఎంపిక చేయడం విశేషం. కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత విద్యార్థులదేనని, పర్యావరణ పరిరక్షణ మన భవిష్యత్తుతో ముడిపడి ఉందని పలు సూచనలు అందించారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ జి. అర్చన , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆరె రాజు, డాక్టర్ ఓం ప్రకాష్, నిర్మల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధాకర్, డా.గంగాధర్,సుభాష్ , సూర్యసాగర్ సార్, అధ్యాపకులు, కే రఘునాథ్, డాక్టర్ భీమ్రావు, యూ. రవికుమార్, డాక్టర్ పి.జి. రెడ్డి, డాక్టర్ శంకర్, డా, సంతోష్, శ్రావణ్య, హుజమ, తదితరులు పాల్గొని విద్యార్థులకు మానవీయ విలువలను గుర్తు చేశారు.
మధ్యాహ్నం అనంతరం నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో డాక్టర్ చంద్రశేఖర్ హెల్త్ & హైజీన్, జీవనశైలి, పోషకాహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం పై ఉపయోగకరమైన సూచనలు ఇచ్చారు. ఆరోగ్యమైన విద్యార్థే ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిస్తాడని ఆయన పేర్కొన్నారు. అలాగే శ్రీ సాయి కుమార్ గారు టాస్క్ జిల్లా మేనేజర్ employability skills గూర్చి విద్యార్థులకు సవివరంగా వివరించారు. ఉద్యోగం సంపాదించడానికి కావలసిన సాఫ్టు స్కిల్స్ వాటికి కావలసిన సామర్థ్యాల సంపాదన గూర్చి వివరించారు.
దీనితోపాటు నిఖిల్ చంద్ర రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన కల్పించారు. వ్యక్తిత్వ వికాసం, లక్ష్య సాధన, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ వంటి అంశాలపై ప్రభావవంతమైన ఉపన్యాసం ఇచ్చి వాలంటీర్లలో నూతనోత్సాహాన్ని నింపారు.

📌 గ్రామ ప్రజలు, స్థానిక ప్రతినిధులు, అధ్యాపకులు వాలంటీర్ల సేవాస్ఫూర్తిని అభినందించారు.
📌 పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర మహోన్నతమన్నారూ ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు వారిని సన్మానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.