:ఆత్మకూరులోని వాయుపుత్ర బైపాస్ రోడ్డుపై వాకర్స్ భద్రత కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వాకింగ్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను స్థానికులు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు.సీఐ గంగాధర్, ఎస్ఐ జంపానీ కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి వాకర్స్తో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని వాకింగ్ సమయాలను నిర్ణయించారు.నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు బైపాస్ రోడ్డులో ఒకవైపు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. మిగిలిన సమయాల్లో వాహనాల ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ఈ సమయాలను తెలియజేస్తూ ఫ్లెక్సీ, సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.వాహనదారులు నిర్దేశిత సమయాలను గమనించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాకర్స్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని సీఐ గంగాధర్ కోరారు.
