Story highlights
- కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో పి.
- సతీష్ కి గ్రామ ప్రజలు, సిఐటియు బృందం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కులాయి సౌకర్యం కల్పించాలన్నారు.
- బాలాజీ నగర్ నుండి సుందరయ్య కాలనీ వరకు పూర్తిస్థాయి రోడ్డు సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలన్నారు.
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో పి. సతీష్ కి గ్రామ ప్రజలు, సిఐటియు బృందం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కులాయి సౌకర్యం కల్పించాలన్నారు. బాలాజీ నగర్ నుండి సుందరయ్య కాలనీ వరకు పూర్తిస్థాయి రోడ్డు సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలన్నారు. బీసీ కాలనీ సచివాలయం 3 నుండి కోరమండల్ పరిశ్రమ వరకు డ్రైనేజీ కాలువ వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. వలసపాకల సెంటర్ నుండి వి.ఎస్ లక్ష్మి కాలేజ్ వరకు ఉన్న వలసపాకల మెయిన్ రోడ్డు వెడల్పు చేసి రెండు లైన్లు రోడ్డు వేయాలి అన్నారు.గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారమయ్యే వరకు కోరమండల్ పరిశ్రమ ద్వారా ఐదు ట్రాక్టర్లు నీటి సరఫరా ప్రతిరోజు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సుందరయ్య కాలనీ ప్రజలు శివలక్ష్మి, రాము, భవాని, పెద్ద లక్ష్మి, బీసీ కాలనీ ప్రజలు రామకృష్ణ, రాజేష్, డేవిడ్, సిద్దిరాజు, సాయి, అప్పలరాజు, సురేంద్ర, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.