వర్ష ప్రభావిత ప్రాంతాలలో డాక్టర్ కందుల పర్యటన
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
★ వార్డులో ప్రతి ప్రాంతాన్ని కలియ తిరిగిన డాక్టర్ కందుల
★ తారకరామ కాలనీలో పాక్షికంగా కూలిన నాలుగు ఇళ్లు
★ కృష్ణ గార్డెన్స్ లో తాగునీటిలో కలుస్తున్న మురుగునీరు
★ మూడు రోజులు ముందస్తుగా రేషన్ సరుకులు అందజేత
వర్ష ప్రభావిత ప్రాంతాలలో విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పర్యటించారు.
వార్డులోని ప్రతి ప్రాంతాన్ని పర్యటించి ప్రజలను కలుసుకున్నారు.
వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తుఫాను కారణంగా భారీ వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పిల్లలు, వృద్దులు, గర్భిణీలు ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రాకూడదని చెప్పారు.
దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా చెట్లు, హోర్డింగులు కూలి పాయే అవకాశం ఉందన్న వాటి కింద ఉండవద్దని సూచించారు.
అలాగే వార్డులో తారకరామ కాలనీలో పాక్షికంగా కూలిపోయిన నాలుగు ఇళ్లను ఆయన పరిశీలించారు.
వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగిన సహాయం చేయాలని కమిషనర్ కి విన్నవించారు.
అలాగే వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మార్వో దృష్టికి కూడా తీసుకువెళ్లారు.
అదేవిధంగా కృష్ణ గార్డెన్స్ ప్రాంతంలో తాగునీటిలో మురుగునీరు చేరిపోయి వస్తూ ఉండటం పై గమనించి ఈ విషయం అధికారులకు తెలియజేశారు.
మూడు రోజులు ముందుగా రేషన్ సరుకులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్డులో తారకరామ కాలనీ తో పాటు అలాగే కృష్ణ గార్డెన్స్ అదే విధంగా భీమ్ నగర్, అల్లిపురం, ఏడు గుళ్ళు ప్రాంతం, నేరెళ్ల కోనేరు ప్రాంతాలలో ఆయన పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు.
ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తాను ముందు ఉండి ఆ సమస్య పరిష్కారానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని ఎవరు ఆధ్వర్యంలో డాక్టర్ కందుల నాగరాజు భరోసా ఇచ్చారు.
వీఆర్వో తులసి, కే .కృష్ణ, సిపిఐ బుజ్జి, పి. చిన్ని,ఎస్. రాము,బి. అప్పలరాజు,ఎస్. లక్ష్మణరావు, వై .గణేష్, ఎస్ .కృష్ణ, సన్ని బాబు తదితరులు పాల్గొన్నారు.


