వర్షాల సమయంలో సమస్యలు రాకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తా
మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీ నివాసులు.
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నవంబర్ 01 ( నవ్యాంధ్ర వార్తాపత్రిక ) రైల్వేకోడూరు మండలం పరిధి, వైసిపి ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు చొరవతో, రెడ్డివారిపల్లి బ్రిడ్జి పనులతో పాటు, జగనన్న కాలనీల వరకు డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు, అందులో భాగంగా రెడ్డివారి పల్లి హరిజనవాడ, అరుంధతి వాడ ల దగ్గర 10 లక్షల రూపాయలతో డ్రైనేజీ కాలువలు పూర్తి చేయగా ఇటీవల కురిసిన బారి వర్షాలకు రెడ్డివారి డ్రైనేజీ కాలువ పొంగి రోడ్డుపై ప్రవహించి గ్రామ ప్రజలుకు ఇబ్బందికరంగా మారడంతో వర్షాలు తగ్గిన మరుసటి రోజు పనులు జరిపి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా, పనులు జరుగుతున్న ప్రదేశానికి చేసిన కొరముట్ల శ్రీనివాసులు డ్రైనేజీ కాలువలను పరిశీలించి భవిష్యత్తులో ఎంత వర్షాలు, మరదలు వచ్చినా వర్షపు నీరు సజావుగా వెళ్లేటట్లు యుద్ధ ప్రాతపదికిన పనులు చేయిస్తానని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు.


