Thursday, 5 February 2026
  • Home  
  • వర్షాల వలన పారిశుద్ధ్యం క్షీణించకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వర్షాల వలన పారిశుద్ధ్యం క్షీణించకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలి

సఖినేటిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఇబ్బందులను తొలగించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సఖినేటిపల్లి మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, హెల్త్ సిబ్బంది మరియు మండల స్థాయి అధికారులతో సఖినేటిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వీరా మల్లిబాబు అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో గౌరవ శాసన సభ్యులు దేవా వరప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గౌరవ శాసన సభ్యులు మాట్లాడుతూ గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వలన నీరు ఇళ్ళమధ్యకు చేరడం, చెత్త తొలగించక పోవడం, మొదలగు కారణాల వలన పారిశుద్ధ్యం క్షీణించి, ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని అన్నారు. కాబట్టి వెంటనే గ్రామపంచాయతీలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజన్ల సహాయంతో ఇళ్ళచుట్టు, రోడ్లపై చేరిన ముంపునీటిని లోతట్టు ప్రాంతాలకు తరలించాలి అని సూచించారు.అదే విధంగా ఇళ్ల దగ్గర చెత్తను, డంపింగ్ యార్డులకు తరలించాలి. బ్లీచింగ్, ఫాగింగ్ చేపట్టాలని ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఇంటింటి సందర్శన చేసి, ప్రజలు జబ్బులు జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి అని అన్నారు సర్పంచులు, రాజకీయనాయకులు, మహిళా సంఘాలు పారిశుధ్యం పై దృష్టి సారించాలని అని అన్నారు గ్రామపంచాయతీకి చెందిన 50% సాధారణ నిధులు, 30% 15వ ఆర్థిక సంఘం నిధులు పారిశుద్ధ్యనికి ఖర్చు పెట్టాలి అని తెలిపారు.ప్రజలు జబ్బులు జ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని పంచాయతీ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు.ఈ సమావేశం లో మండల అధికారులు, సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, హెల్త్ సిబ్బంది మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

సఖినేటిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఇబ్బందులను తొలగించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సఖినేటిపల్లి మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, హెల్త్ సిబ్బంది మరియు మండల స్థాయి అధికారులతో సఖినేటిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వీరా మల్లిబాబు అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో గౌరవ శాసన సభ్యులు దేవా వరప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గౌరవ శాసన సభ్యులు మాట్లాడుతూ గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వలన నీరు ఇళ్ళమధ్యకు చేరడం, చెత్త తొలగించక పోవడం, మొదలగు కారణాల వలన పారిశుద్ధ్యం క్షీణించి, ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని అన్నారు. కాబట్టి వెంటనే గ్రామపంచాయతీలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజన్ల సహాయంతో ఇళ్ళచుట్టు, రోడ్లపై చేరిన ముంపునీటిని లోతట్టు ప్రాంతాలకు తరలించాలి అని సూచించారు.అదే విధంగా ఇళ్ల దగ్గర చెత్తను, డంపింగ్ యార్డులకు తరలించాలి. బ్లీచింగ్, ఫాగింగ్ చేపట్టాలని ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఇంటింటి సందర్శన చేసి, ప్రజలు జబ్బులు జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి అని అన్నారు సర్పంచులు, రాజకీయనాయకులు, మహిళా సంఘాలు పారిశుధ్యం పై దృష్టి సారించాలని అని అన్నారు గ్రామపంచాయతీకి చెందిన 50% సాధారణ నిధులు, 30% 15వ ఆర్థిక సంఘం నిధులు పారిశుద్ధ్యనికి ఖర్చు పెట్టాలి అని తెలిపారు.ప్రజలు జబ్బులు జ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని పంచాయతీ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు.ఈ సమావేశం లో మండల అధికారులు, సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, హెల్త్ సిబ్బంది మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.