వర్షాల కారణంగా గృహాలు కూలిపోతున్న దుప్పికుంట గ్రామ ప్రజల దుర్దశ
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని దుప్పికుంట గ్రామంలో గత 15 ఏళ్లుగా నివసిస్తున్న నవీపేట ప్రజలు సరైన గృహాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా తాత్కాలికంగా నిర్మించిన గృహాలు కుప్పకూలుతున్నాయి. అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. ఇటీవల మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంతమంది గృహాలు నేలమట్టమయ్యాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పాములు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. సరైన రోడ్లు లేక, స్కూల్‌కి వెళ్లే పిల్లలు బురదలోనే ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన స్పందించి గృహాలు, స్థలాలు, ఆర్థిక సాయం అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
0 Comments
Dhanunjay
June 25, 2025test
Dhanunjay
June 25, 2025test2