రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడో శనివారం నిర్వహించే “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమం భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్‌లో “వర్షాకాల పరిశుభ్రత – Monsoon Hygiene” కాన్సెప్ట్‌తో కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ వర్షాకాలంలో పరిసరాలను పొడిగా ఉంచి దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా వంటి వ్యాధులను నివారించుకోవాలని సూచించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులు లక్ష్మీకలావతి, సుహాసిని, శివనారాయణ అపరిశుభ్రమైన నీరు, సరిగా ఉడకని ఆహారం వల్ల వచ్చే పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాఠశాల పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టగా, బ్లీచింగ్ పౌడర్ చల్లి ర్యాలీ నిర్వహించారు. చివరగా ఉపాధ్యాయుడు నవీన్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు.

వర్షాకాల పరిశుభ్రతపై ఉపాధ్యాయుల అవగాహన – విద్యార్థుల శుభ్రతా కార్యక్రమం, ప్రతిజ్ఞ