నకిరేకల్ :జనవరి ( పున్నమి ప్రతినిధి )
పరిశీలన ద్వారా విషయాన్నీ అవగాహన చేసుకుని సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్
బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి, డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ అవార్డ్స్ ను ప్రారంభించారు. శాస్ర సాంకేతిక విజ్ఞానం వల్ల గొప్ప ఆవిష్కరణలు సాధ్యమయ్యాయని, విద్యార్థులు చిన్ననాటి నుంచే పరిశీలన అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 284 ప్రదర్శనలో జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.


