కామారెడ్డి,15 అక్టోబర్, పున్నమి ప్రతినిధి :
రాత్రి పుట్టకముందే రామారెడ్డి వీధులన్నీ నిశ్శబ్దం గా మారిపోతున్నాయి. ఎవరి వాహనం బయట ఉంటుందో వారికి నిద్రే దొరకడం లేదు.ఒకపక్క ఈ కో, సండ్రో, మరోపక్క ఈకో,ఒక్కో వాహనం ధ్వంసా నికి గురైనాయి.వరుసగా మెరుగు గణేష్, మేకల శ్రీనివాస్, లింగాల స్వామి గౌడ్ వాహనాలు ఒకే సారి పాడైపోవడమే ప్రజల్లో భయాన్ని రెట్టింపు చేసింది. మండలంలో పోలీస్ స్టేషన్ ఉన్నా, ఈ ధాటికి అంతు కనపడట్లేదు.గంజాయి గ్యాంగ్ పని అంటున్నార. మెకానిక్‌ల గ్యాంగ్ అని మరోకరు అంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో అనుమానం. తెల్లవారితే వాహనాల గ్లాస్ లు పగలగొట్టబడి, లోపల సామాన్లు విరిగి పడిపోవడం ప్రజలను ఆవేదనలో ముంచేస్తోంది. రాత్రి పహారా కాస్తున్న పోలీసులు తలలు పట్టుకున్నారు.ఎవరు చేస్తు న్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదని అంటు న్నారు. కానీ మండల ప్రజలు మాత్రం కోపంతో ఉడుకుతున్నారు.ఇలా కొనసాగి తే మనమే గస్తీ కాస్తాం, అని నిర్ణయించు కుంటున్నారు. రామారెడ్డి లో భయం రెట్లు పెరుగుతుంటే, అందరి నోట ఒక్క మాటే వినిపిస్తోంది.వీళ్లను ఊరుకోరాదు అని అంటున్నారు.


