పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి తెలంగాణ ప్రతి నిధి)
వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర చలిగాలులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండగా, వికారాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 8.1 డిగ్రీలుగా నమోదు కావడం చలికాలం తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. రాత్రివేళల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు చేరుకోవడంతో ప్రజలు వణుకుతున్నారు.
మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండగా, రైతులు ఉదయపు మంచు ప్రభావంతో పంటలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో 8.4, 9.1, 9.6, 9.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోవడం గమనార్హం.
వాతావరణ శాఖ ప్రకారం వచ్చే 3 నుండి 4 రోజులు ఇలాగే చలి కొనసాగనుంది. ప్రజలు రాత్రివేళల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించింది

