యువతలో నిక్షిప్తమైన ప్రతిభను వెలికితీయడమే రాష్ట్ర యువజనోత్సవం యువ– 2025 ప్రధాన లక్ష్యమని యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్.భరణి తెలిపారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు.
డిసెంబరు 18,19,20 తేదీల్లో గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలను “యూత్ ఫర్ స్వర్ణాంధ్ర” థీమ్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ థీమ్ యువత ఆలోచనలు, సృజనాత్మకత, ప్రతిభ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి జిల్లా స్థాయి విజేతలు పాల్గొంటారని, మొత్తం 700 మందికి పైగా యువత రాష్ట్ర స్థాయి పోటీల్లో పోటీ పండిస్తున్నారని తెలిపారు. 15–29 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారికి పోటీలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించినవారిని జాతీయ యువజనోత్సవం–2026లో పాల్గొనడానికి పంపుతామని వెల్లడించారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జానపద నృత్యం, జానపద గానం, పెయింటింగ్, ప్రకటన రచన, కవితా రచన, కథా రచన, ఆవిష్కరణ–సైన్స్ మేళా వంటి ఏడు విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. విజేతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలతో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. ఈవెంట్‌లో గ్రాండ్ కార్నివల్ పరేడ్, ప్యానెల్ డిస్కషన్లు, యూత్ కాన్, యూత్ ఇంపాక్ట్ ల్యాబ్స్ నిర్వహిస్తామని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఢిల్లీ పాలసీ నిపుణులు, వైద్యులు, సివిల్ సర్వెంట్స్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పాల్గొంటారని ఆమె వివరించారు. CII, I-WIN, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు అసోసియేషన్లు, NSS, స్వచ్ఛంధ సంస్థలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన డిజిటల్ మారథాన్ #AndhraYuvaSankalp2k25 ఫైనల్స్, బహుమతి కార్యక్రమం కూడా మహోత్సవంలో జరుగుతుందని చెప్పారు.
యువత “స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో, వికసిత్ భారత్ నిర్మాణంలో ఇంటెలెక్సువల్ వారియర్స్‌గా తీర్చి దిద్దుకోవాలి’’ అని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారని కమిషనర్ భరణి తెలిపారు. అనంతరం యువ–2025 ఈవెంట్ కర్టెన్‌రైజర్‌ను ఆవిష్కరించారు.
సమావేశంలో ఏపీ యూత్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల సీఈవోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వడ్డేశ్వరంలో డిసెంబర్18 నుంచి రాష్ట్ర యువజనోత్సవాలు యువతలో నైపుణ్యాల వెలికితీతే యువ–2025 లక్ష్యం : కమిషనర్ భరణి
యువతలో నిక్షిప్తమైన ప్రతిభను వెలికితీయడమే రాష్ట్ర యువజనోత్సవం యువ– 2025 ప్రధాన లక్ష్యమని యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్.భరణి తెలిపారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు. డిసెంబరు 18,19,20 తేదీల్లో గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలను “యూత్ ఫర్ స్వర్ణాంధ్ర” థీమ్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ థీమ్ యువత ఆలోచనలు, సృజనాత్మకత, ప్రతిభ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి జిల్లా స్థాయి విజేతలు పాల్గొంటారని, మొత్తం 700 మందికి పైగా యువత రాష్ట్ర స్థాయి పోటీల్లో పోటీ పండిస్తున్నారని తెలిపారు. 15–29 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారికి పోటీలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించినవారిని జాతీయ యువజనోత్సవం–2026లో పాల్గొనడానికి పంపుతామని వెల్లడించారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జానపద నృత్యం, జానపద గానం, పెయింటింగ్, ప్రకటన రచన, కవితా రచన, కథా రచన, ఆవిష్కరణ–సైన్స్ మేళా వంటి ఏడు విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. విజేతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలతో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. ఈవెంట్‌లో గ్రాండ్ కార్నివల్ పరేడ్, ప్యానెల్ డిస్కషన్లు, యూత్ కాన్, యూత్ ఇంపాక్ట్ ల్యాబ్స్ నిర్వహిస్తామని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఢిల్లీ పాలసీ నిపుణులు, వైద్యులు, సివిల్ సర్వెంట్స్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పాల్గొంటారని ఆమె వివరించారు. CII, I-WIN, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు అసోసియేషన్లు, NSS, స్వచ్ఛంధ సంస్థలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన డిజిటల్ మారథాన్ #AndhraYuvaSankalp2k25 ఫైనల్స్, బహుమతి కార్యక్రమం కూడా మహోత్సవంలో జరుగుతుందని చెప్పారు. యువత “స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో, వికసిత్ భారత్ నిర్మాణంలో ఇంటెలెక్సువల్ వారియర్స్‌గా తీర్చి దిద్దుకోవాలి’’ అని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారని కమిషనర్ భరణి తెలిపారు. అనంతరం యువ–2025 ఈవెంట్ కర్టెన్‌రైజర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఏపీ యూత్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల సీఈవోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

