సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)
రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మరో 0.25 శాతం తగ్గించే అవకాశం ఉందని SBI రీసెర్చ్ అంచనా వేసింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రెపో రేటు 1 శాతం తగ్గి ప్రస్తుతం 5.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటంతో వడ్డీ రేట్లలో మరో కోతకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, కొంతమంది ఆర్థిక నిపుణులు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచవచ్చని అభిప్రాయపడుతున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్ 1న వెలువడనున్న RBI పాలసీ నిర్ణయం కీలకంగా మారింది. ఈ నిర్ణయం రుణాలపై ప్రభావం చూపనుంది.


