Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

వచ్చా ర్యాలీలకి ఊరేగింపులకు అనుమతి లేదు

Punnami Newsroom Published:
వచ్చా ర్యాలీలకి ఊరేగింపులకు అనుమతి లేదు

*రేపు విజయోత్సవ ర్యాలీలు,ఊరేగింపులకు అనుమతి లేదు*

ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం

ఇబ్రహీంపట్నం,

రేపు కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవాల కు,ర్యాలీల కు అనుమతి లేదని విజయవాడ పోలీస్ కమిషన రాజశేఖర్ బాబు ఆదేశాలు జారీ చేసినట్లు ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు మద్దతుదారులతో కలసి ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, డప్పు వాయిద్యాలతో కూడిన ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో ప్రజాశాంతికి భంగం కలిగించేలా బాణసంచా కాల్చడం, అధిక శబ్దంతో కూడిన మైక్ సెట్లు/డిజె లను ఉపయోగించడం పూర్తిగా నిషిద్ధమని ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరరేట్ పరిధిలో సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. మరియు పోలీసు చట్టం ( 30 Police Act) అమలులో ఉన్నాయన్నారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతూ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరస్పరం శాంతి సామరస్యాలను పాటించాలని కోరారు.

వచ్చా ర్యాలీలకి ఊరేగింపులకు అనుమతి లేదు

వచ్చా ర్యాలీలకి ఊరేగింపులకు అనుమతి లేదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *