Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

మహా కూటమి జి కొండూరు మండలం ఎంపిటిసి జడ్పిటిసి అభ్యర్థులు గెలుపు కోసం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ర్యాల

Punnami Newsroom Published:
మహా కూటమి జి కొండూరు మండలం ఎంపిటిసి జడ్పిటిసి అభ్యర్థులు గెలుపు కోసం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ర్యాల

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం..*

*జి కోండూరు గ్రామంలో రోడ్ షో నిర్వహించిన వసంత కృష్ణ ప్రసాదు గారు*

*జెడ్పీటీసి అభ్యర్థిని డాక్టర్ రేవతి చంద్రిక గారు యంపిటిసి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం*

*ఎన్టీఆర్ జిల్లా, జి కోండూరు, 02/11/26*

*కూటమి బలపరిచిన జి కోండూరు యంపిటీసి జడ్పీటిసి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు జి కోండూరు పట్టణం లో విస్తృత ప్రచారం నిర్వహించారు*

*ప్రచార రధం పై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, జనసేన అధికార ప్రతినిధి అక్కల గాంధీ గారితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఓటర్లను సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్దించారు. కూటమి అభ్యర్థులకు ప్రజల ఆశీస్సులు అందిస్తే అభివృద్ధిలో వారు భాగస్వాములు అవుతారని పిలుపునిచ్చారు.*

*హరతులు పట్టి అశీర్వదించిన మహిళలు*

*గ్రామంలో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళలు హారతులు పట్టి, పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. ప్రచార రథంపై నుంచి ప్రజలను పలకరిస్తూ, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ఓటర్లకు విజ్ణప్తి చేశారు.*

*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లో రాబోయే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించి, ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని వివరించారు.*

*ఈ కార్యక్రమం లో జి కోండూరు మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*

*బి.మల్లి(వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

మహా కూటమి జి కొండూరు మండలం ఎంపిటిసి జడ్పిటిసి అభ్యర్థులు గెలుపు కోసం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ర్యాల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *