Sunday, 7 December 2025
  • Home  
  • “వంశవృక్షం” (కథ) – డాక్టర్ బద్రి పీర్ కుమార్
- సాహితీ

“వంశవృక్షం” (కథ) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

మనం ఎంత ఎదిగినా మన మూలాలు మరచిపోకూడదు కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాలి ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూసి మురిసిపోవాలి గాని మదనపడే రోజులు రాకూడదు అనే భావనతో ఒకపక్క సామాజిక న్యాయం, చైతన్య స్ఫూర్తిని కలిగించే రచనలు చేస్తూ మరొకపక్క వినుకొండ గ్రామంలో వృక్ష శాస్త్ర ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూనే తన తల్లిదండ్రులకు తల్లి తండ్రిగా మారి వారి బాగోగులు చూస్తూ జీవనం సాగిస్తున్నాడు విశ్వం మాస్టర్ గా పిలువబడే విశ్వం. మరో వారం రోజుల్లో రిటైర్డ్ అవుతున్నాడు తన చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుతం ఆ గ్రామ సర్పంచ్ నరసింహ విశ్వం మాస్టర్ రిటైర్మెంట్ ఫంక్షన్ జిల్లాస్థాయిలో చాలా గ్రాండ్ గా చేయాలని పట్టు పట్టాడు కానీ విశ్వం మాస్టర్కు సన్మానాలు పొగడ్తలు పబ్లిసిటీ చేసుకోవడం అంటే మొదటినుంచి ఇష్టం లేదు. అయితే నరసింహ ఎలాగైనా తన మిత్రుడు విశ్వానికి గొప్ప ఆత్మీయ అభినందన సభ జరపాలని తనకోసం కాకపోయినా ‘నిన్ను అభిమానించే ఈ ఊరి జనం కోసం అయినా’ ఒప్పుకోమని అతి కష్టం మీద విశ్వ మాస్టర్ ని ఒప్పిస్తాడు. ఇక స్నేహితులు శ్రేయోభిలాషులు బంధువులు ఆత్మీయులు అందరికంటే ముందుగా విశ్వం మాస్టర్ తనయులు ఇద్దరినీ రెండు రోజులు ముందుగా రావాలని వెంట వెంటనే ఫోన్ చేసి అందరితో మాట్లాడుతున్నాడు నరసింహ. మాటిచ్చాక చేసేదేమీ లేక సన్మాన అభినందనలకు సిద్ధమై తను ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రుల సేవలు, విద్యాబుద్ధులు చెప్పిన గురువు కైకాల లక్ష్మయ్య గారిని గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమైనాడు విశ్వం. విశ్వం మాస్టర్ కి ఇద్దరు కవల పిల్లలు ఒకరు ప్రకాష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విశాఖపట్నంలోనూ, మరొకరు వినోద్ సివిల్ ఇంజనీర్ అమరావతి లోను పనిచేస్తున్నారు. వీరిద్దరికీ పెళ్లిళ్లు అవ్గానే వారి సంసారాలు వారివన్నట్లు విశ్వం మాస్టర్ కోరిక మేరకు ఏడాదికి ఒకసారి వచ్చి పోయేవారు. 6 నెలల క్రితమే వచ్చి పోయిన తనయులు తన ఉద్యోగ విరమణ సందర్భంగా మళ్లీ వస్తున్నారని ఆనందంతో అలా గోడకు తగిలించి ఉన్న ఫోటో ‘నీకోసం నేను మళ్లీ పుడతా నీ మనవరాలిగా’ అంటూ చూస్తూ ఉన్నట్లుగా ఉన్న తన అర్థాంగిని చూశాడు. ‘ ఇంకెక్కడికి వస్తావే ఇద్దరు పిల్లలు మరో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించుకున్నారుగా… ఇంకెక్కడికొస్తావ్… నీవు రావడం ఉండదు నేనే నీ దగ్గరికి రావడం తప్ప, కాలం పరుగులు తీస్తుంది అనడానికి నా రిటైర్మెంట్ నిదర్శనం అప్పుడే 62 సంవత్సరాలు నిండుతున్నాయి అయినా నా తల్లికి నేను పసిబిడ్డే’ అని మనసున అనుకుంటున్నాడు విశ్వం. తన భార్య రుక్మిణి ఇద్దరు కవలలకు అతి కష్టం మీద జన్మనిచ్చి తనువు చాలించింది. అప్పటినుండి ఆ పిల్లలకు విశ్వం తల్లి తల్లిఅయి వారి ఆలనా పాలన చూసింది ‘ఈ విషయం ప్రకాష్ వినోద్ లు మర్చిపోయారా? లేక, భార్యాబిడ్డల, ఉద్యోగ బాధ్యతలు ఎక్కువై మరుగున పెట్టారా? విధి రాతకు వదిలేస్తాం’ అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు విశ్వం. ###### “ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను ఇది ఇంతవరకు మా నాన్నకు కూడా తెలియదు. ఈ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వంశవృక్షం నవల రాసిన మా నాన్నగారికి ఇస్తున్నట్లు ఈరోజు ప్రకటన రాబోతుంది. మా నాన్న ఉద్యోగ విరమణ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఇంతమందిని చూస్తుంటే.. మా నాన్న ఒక వ్యక్తి కాదు సామాజిక చైతన్య శక్తి.. మేము ఆయన బిడ్డలుగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం” అనే మాటలు వినపడుతుండగా చటుక్కున మెలుకువ వచ్చి ప్రక్కనే పడుకుని ఉన్న ప్రకాష్ వినోద్ ని చూశాడు. “ఓ.. ఇది కలా.. నిన్న జరిగిన నా సన్మాన కార్యక్రమంలో నా బిడ్డలేనా ఇలా మాట్లాడుతున్నది అనుకున్నా కదా.. అందుకేనేమో ఇలా కలలో రీక్యాప్ అయింది.” అనుకున్నాడు విశ్వం. ఉదయం టిఫిన్ చేసి ‘నాన్న ఇక మేము బయలుదేరుతున్నాం మీరు ఏమి అనుకోకపోతే ఒక మాట’ అంటారు ప్రకాష్ వినోద్. ‘అనుకోవటానికి ఏముందిరా చెప్పండి’ అంటాడు విశ్వం. ‘మరి ఏం లేదు.. నానమ్మను తాతయ్యని వృద్ధాశ్రమంలో వదిలి మా వద్దకు మీరు ఎలాగూ రారని మాకు అర్థం అయింది. సరే మీ ఇష్ట ప్రకారం మీరు ఈ ఊర్లోనే ఉండండి.. అయితే మీకు రిటైర్మెంట్ డబ్బులు.. అన్ని కటింగ్స్ పోను నికరంగా 20 లక్షలు వచ్చాయి అన్నారు కదా.. మరి పట్టణంలో మా ఖర్చులకు తగిన సాలరీ రావడం లేదు ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం కోసం మీకు వచ్చిన ఆ డబ్బులు చెరి 10 లక్షలు ఇవ్వండి నాన్న’ అంటారు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డ ప్రకాష్ వినోద్. అలాగే అన్నట్లు తలూపి లోపల బీరువాలో ఉన్న రెండు సర్టిఫికెట్స్ తీసుకొచ్చి చెరొకటి ఇస్తాడు విశ్వం. అవి తమ తాతయ్య నానమ్మ అయిన రాఘవయ్య, రమణమ్మ పేరు మీద ఉన్న ఫిక్స్ డిపాజిట్ సర్టిఫికెట్స్ అని తెలుసుకున్న ప్రకాష్ వినోద్ లు మండిపడి ‘కన్న బిడ్డల్ని కాదని రేపోమాపో పోయే ముసలోళ్లకు 20 లక్షలు ఎందుకు.. ఈడబ్బుల్ని వీళ్లేమి చేసుకుంటారు’ అని అడగ్గా ‘చెట్టు అంత కొడుకుని నేనుండగా ఈ డబ్బుని ఏమైనా చేసుకోవలసిన అవసరం వాళ్లకి ఏంటి రా.. ఓ కొడుగ్గా వంశవృక్షం క్రింద కుటుంబ ఆశ్రమాన్ని నిర్మించుకున్న నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వ అవార్డు తీసుకునే స్థాయి వరకు వచ్చానంటే దానికి కారణం.. మీ దృష్టిలో ముసలోళ్ళు.. నా దృష్టిలో కనిపించే దైవాలు వీరు… అందుకే నా భవిష్యత్తు కోసం వారు పడిన కష్టాలకు చేసిన త్యాగాలకు కానుకగా నేను వారికిచ్చే భరోసా ఈ డిపాజిట్స్’ అంటాడు విశ్వం. తమకు అత్యవసరం అంటే పట్టించుకోకుండా వృద్ధులైన తాతయ్య నానమ్మ లపై డిపాజిట్ చేయడం జీర్ణించుకోలేని ప్రకాష్ వినోద్ లు ‘ సరే మీ డబ్బులు మీ ఇష్టం మా బాధలు మేం పడతాం’ అంటూ విసురుగా వెళ్లి బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా… ఇదంతా గమనిస్తూ తీవ్రమనస్థాపం చెంది హైబీపీతో ఉన్న నాన్నమ్మను కూడా పట్టించుకోకుండా, తండ్రి ఆవేదనను అర్థం చేసుకోకుండా పయనమైన బిడ్డలను చూసి ‘ఎన్నో కథలు, నవలలు రాశాను.. వాటన్నింటినీ సమాజం ఆమోదించింది.. అవి చదివి తమ సంసారాలను బాగు చేసుకున్న వారు ఫోన్లు చేసి ఇప్పటికీ నన్ను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంట గెలచి రచ్చ గెలవమంటారు.. మరి నేను రచ్చ గెలిచానా? అలా భ్రమపడ్డానా? ఇంట మాత్రం ఓడిపోయాను.. నా పెంపకంలో లోపం కనిపిస్తుంది.. ఇంటిలోని బిడ్డలకు మానవ సంబంధాలు అనుబంధాలు గూర్చి చెప్పలేని నా రచనలు సమాజానికి ఏమి సందేశం ఇవ్వగలవు’ అంటూ మనస్థాపం చెంది తన రచనలన్నీ తగలబెట్టబోయాడు విశ్వం. ఇంతలో ఇది గమనించిన విశ్వం తండ్రి రాఘవయ్య తన శక్తిని అంతా కూడగట్టుకుని విశ్వాన్ని నివారించి మనవళ్ళని ఉద్దేశించి విశ్వం తమకు చేస్తున్న సేవలు వివరిస్తూ ‘ఒరేయ్.. మనవళ్ళు.. మీ నాన్న గురించి ఏమి చెప్పినా తక్కువే ఆఖరికి మాకు స్నానాలు చేయించి మాకు బట్టలు మార్చేది కూడా నా బిడ్డ విశ్వంరా.. వాడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే.. ఒరేయ్ విశ్వం నేను చచ్చిపోతే నీవు ఏడుస్తావు కదూ? అని నేనంటే.. ఏడవను అన్నాడు. నేను ఆశ్చర్యపోయి ఎందుకు? అని అడిగాను. దానికి అప్పుడు వాడు ఇచ్చిన సమాధానం.. మీరు చనిపోతే నేను ఏడ్చేది మీరు చూడలేరు కదానాన్న.. కాని మీరు బ్రతికున్నంత వరకు మీ జీవితాంతం మీ కంటిలో కన్నీరు కారకుండా చూసుకుంటాను అన్నాడు రా.. అప్పటినుండి ఇప్పటివరకు ఆ శ్రవణ కుమారుడు తమ వృద్ధ తల్లిదండ్రులని తన భుజాన మోసినట్లు వాడు చెప్పినట్లుగానే కంటిలో కన్నీరు కారకుండా చూసుకుంటున్నాడు రా.. వాడి ప్రేమ విశ్వవ్యాప్తం.. ఇలాంటి కొడుకు ఉన్న తల్లిదండ్రులు నిండు నూరేళ్లు బ్రతుకుతారు.. విశ్వం మాకు ఇచ్చింది డబ్బులు కాదు ప్రేమ.. అదే ప్రేమ రేపు మీ బిడ్డలు మీకు పంచాలి.. అలా పంచగలిగేటట్లు మీ పెంపకం ఉండాలి’ అని రాఘవయ్య ఆవేదనతో వణుకుతున్న గొంతుతో అనగానే తమది వక్రబుద్ధి అని గ్రహించి ఆలోచనలో పడ్డ ప్రకాష్ వినోద్ లు విశ్వం వద్దకొచ్చి చేతిలో ఉన్న అగ్గిపెట్టిని లాగేసుకుని తలదించుకుంటారు. వారిలో పశ్చాత్తాపం గమనించిన విశ్వం ‘మానవుని అంతిమ లక్ష్యం సంతృప్తి.. అది ఆస్తుల వల్ల డబ్బుల వల్ల రాదు.. ప్రేమ అనురాగం, ఆప్యాయతలు ఆత్మీయతల వల్లే సంతృప్తి వస్తుంది.. వంశవృక్షానికి మూలమైన పెద్దవారిని కంటికి రెప్పలా చూసుకునే తత్వం ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే ఆ వంశవృక్షం ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా పెరిగి సమాజానికి వెలుగునివ్వడమే కాకుండా ఆదర్శవంతంగా ఉంటుంది.’ అని విశ్వం అంటుండగా ‘మమ్మల్ని క్షమించండి నాన్న మా తప్పు గ్రహించాం.. మీతో పాటు నానమ్మ తాతయ్యలు మాకు దైవ సమానం’ అంటూ ప్రకాష్ వినోద్ లు తండ్రి యొక్క రచనల పుస్తకాలు అన్నిటిని ఒక చోటికి చేర్చి తండ్రి సన్మాన మహోత్సవంలో బహుకరించిన మొక్కని వాటిపై ఉంచి ‘అభ్యుదయ భావాలతో సమాజ సౌభాగ్యానికి మీరు చేసిన రచనలు ప్రచారం చేయడంలో మేము.. మీ వెంటే ఉంటాం’. అంటూ ప్రమాణం చేస్తారు. దీనితో విశ్వం విశ్వసించిన వంశవృక్ష ఫలం సిద్ధించినట్లు అవుతుంది. @ శుభం @

మనం ఎంత ఎదిగినా మన మూలాలు మరచిపోకూడదు కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాలి ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూసి మురిసిపోవాలి గాని మదనపడే రోజులు రాకూడదు అనే భావనతో ఒకపక్క సామాజిక న్యాయం, చైతన్య స్ఫూర్తిని కలిగించే రచనలు చేస్తూ మరొకపక్క వినుకొండ గ్రామంలో వృక్ష శాస్త్ర ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూనే తన తల్లిదండ్రులకు తల్లి తండ్రిగా మారి వారి బాగోగులు చూస్తూ జీవనం సాగిస్తున్నాడు విశ్వం మాస్టర్ గా పిలువబడే విశ్వం.
మరో వారం రోజుల్లో రిటైర్డ్ అవుతున్నాడు తన చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుతం ఆ గ్రామ సర్పంచ్ నరసింహ విశ్వం మాస్టర్ రిటైర్మెంట్ ఫంక్షన్ జిల్లాస్థాయిలో చాలా గ్రాండ్ గా చేయాలని పట్టు పట్టాడు కానీ విశ్వం మాస్టర్కు సన్మానాలు పొగడ్తలు పబ్లిసిటీ చేసుకోవడం అంటే మొదటినుంచి ఇష్టం లేదు. అయితే నరసింహ ఎలాగైనా తన మిత్రుడు విశ్వానికి గొప్ప ఆత్మీయ అభినందన సభ జరపాలని తనకోసం కాకపోయినా ‘నిన్ను అభిమానించే ఈ ఊరి జనం కోసం అయినా’ ఒప్పుకోమని అతి కష్టం మీద విశ్వ మాస్టర్ ని ఒప్పిస్తాడు.
ఇక స్నేహితులు శ్రేయోభిలాషులు బంధువులు ఆత్మీయులు అందరికంటే ముందుగా విశ్వం మాస్టర్ తనయులు ఇద్దరినీ రెండు రోజులు ముందుగా రావాలని వెంట వెంటనే ఫోన్ చేసి అందరితో మాట్లాడుతున్నాడు నరసింహ. మాటిచ్చాక చేసేదేమీ లేక సన్మాన అభినందనలకు సిద్ధమై తను ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రుల సేవలు, విద్యాబుద్ధులు చెప్పిన గురువు కైకాల లక్ష్మయ్య గారిని గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమైనాడు విశ్వం.
విశ్వం మాస్టర్ కి ఇద్దరు కవల పిల్లలు ఒకరు ప్రకాష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విశాఖపట్నంలోనూ, మరొకరు వినోద్ సివిల్ ఇంజనీర్ అమరావతి లోను పనిచేస్తున్నారు. వీరిద్దరికీ పెళ్లిళ్లు అవ్గానే వారి సంసారాలు వారివన్నట్లు విశ్వం మాస్టర్ కోరిక మేరకు ఏడాదికి ఒకసారి వచ్చి పోయేవారు. 6 నెలల క్రితమే వచ్చి పోయిన తనయులు తన ఉద్యోగ విరమణ సందర్భంగా మళ్లీ వస్తున్నారని ఆనందంతో అలా గోడకు తగిలించి ఉన్న ఫోటో ‘నీకోసం నేను మళ్లీ పుడతా నీ మనవరాలిగా’ అంటూ చూస్తూ ఉన్నట్లుగా ఉన్న తన అర్థాంగిని చూశాడు. ‘ ఇంకెక్కడికి వస్తావే ఇద్దరు పిల్లలు మరో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించుకున్నారుగా… ఇంకెక్కడికొస్తావ్… నీవు రావడం ఉండదు నేనే నీ దగ్గరికి రావడం తప్ప, కాలం పరుగులు తీస్తుంది అనడానికి నా రిటైర్మెంట్ నిదర్శనం అప్పుడే 62 సంవత్సరాలు నిండుతున్నాయి అయినా నా తల్లికి నేను పసిబిడ్డే’ అని మనసున అనుకుంటున్నాడు విశ్వం. తన భార్య రుక్మిణి ఇద్దరు కవలలకు అతి కష్టం మీద జన్మనిచ్చి తనువు చాలించింది. అప్పటినుండి ఆ పిల్లలకు విశ్వం తల్లి తల్లిఅయి వారి ఆలనా పాలన చూసింది ‘ఈ విషయం ప్రకాష్ వినోద్ లు మర్చిపోయారా? లేక, భార్యాబిడ్డల, ఉద్యోగ బాధ్యతలు ఎక్కువై మరుగున పెట్టారా? విధి రాతకు వదిలేస్తాం’ అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు విశ్వం.
######
“ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను ఇది ఇంతవరకు మా నాన్నకు కూడా తెలియదు. ఈ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వంశవృక్షం నవల రాసిన మా నాన్నగారికి ఇస్తున్నట్లు ఈరోజు ప్రకటన రాబోతుంది. మా నాన్న ఉద్యోగ విరమణ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఇంతమందిని చూస్తుంటే.. మా నాన్న ఒక వ్యక్తి కాదు సామాజిక చైతన్య శక్తి.. మేము ఆయన బిడ్డలుగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం” అనే మాటలు వినపడుతుండగా చటుక్కున మెలుకువ వచ్చి ప్రక్కనే పడుకుని ఉన్న ప్రకాష్ వినోద్ ని చూశాడు. “ఓ.. ఇది కలా.. నిన్న జరిగిన నా సన్మాన కార్యక్రమంలో నా బిడ్డలేనా ఇలా మాట్లాడుతున్నది అనుకున్నా కదా.. అందుకేనేమో ఇలా కలలో రీక్యాప్ అయింది.” అనుకున్నాడు విశ్వం.
ఉదయం టిఫిన్ చేసి ‘నాన్న ఇక మేము బయలుదేరుతున్నాం మీరు ఏమి అనుకోకపోతే ఒక మాట’ అంటారు ప్రకాష్ వినోద్. ‘అనుకోవటానికి ఏముందిరా చెప్పండి’ అంటాడు విశ్వం. ‘మరి ఏం లేదు.. నానమ్మను తాతయ్యని వృద్ధాశ్రమంలో వదిలి మా వద్దకు మీరు ఎలాగూ రారని మాకు అర్థం అయింది. సరే మీ ఇష్ట ప్రకారం మీరు ఈ ఊర్లోనే ఉండండి.. అయితే మీకు రిటైర్మెంట్ డబ్బులు.. అన్ని కటింగ్స్ పోను నికరంగా 20 లక్షలు వచ్చాయి అన్నారు కదా.. మరి పట్టణంలో మా ఖర్చులకు తగిన సాలరీ రావడం లేదు ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం కోసం మీకు వచ్చిన ఆ డబ్బులు చెరి 10 లక్షలు ఇవ్వండి నాన్న’ అంటారు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డ ప్రకాష్ వినోద్. అలాగే అన్నట్లు తలూపి లోపల బీరువాలో ఉన్న రెండు సర్టిఫికెట్స్ తీసుకొచ్చి చెరొకటి ఇస్తాడు విశ్వం. అవి తమ తాతయ్య నానమ్మ అయిన రాఘవయ్య, రమణమ్మ పేరు మీద ఉన్న ఫిక్స్ డిపాజిట్ సర్టిఫికెట్స్ అని తెలుసుకున్న ప్రకాష్ వినోద్ లు మండిపడి ‘కన్న బిడ్డల్ని కాదని రేపోమాపో పోయే ముసలోళ్లకు 20 లక్షలు ఎందుకు.. ఈడబ్బుల్ని వీళ్లేమి చేసుకుంటారు’ అని అడగ్గా ‘చెట్టు అంత కొడుకుని నేనుండగా ఈ డబ్బుని ఏమైనా చేసుకోవలసిన అవసరం వాళ్లకి ఏంటి రా.. ఓ కొడుగ్గా వంశవృక్షం క్రింద కుటుంబ ఆశ్రమాన్ని నిర్మించుకున్న నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వ అవార్డు తీసుకునే స్థాయి వరకు వచ్చానంటే దానికి కారణం.. మీ దృష్టిలో ముసలోళ్ళు.. నా దృష్టిలో కనిపించే దైవాలు వీరు… అందుకే నా భవిష్యత్తు కోసం వారు పడిన కష్టాలకు చేసిన త్యాగాలకు కానుకగా నేను వారికిచ్చే భరోసా ఈ డిపాజిట్స్’ అంటాడు విశ్వం.
తమకు అత్యవసరం అంటే పట్టించుకోకుండా వృద్ధులైన తాతయ్య నానమ్మ లపై డిపాజిట్ చేయడం జీర్ణించుకోలేని ప్రకాష్ వినోద్ లు ‘ సరే మీ డబ్బులు మీ ఇష్టం మా బాధలు మేం పడతాం’ అంటూ విసురుగా వెళ్లి బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా… ఇదంతా గమనిస్తూ తీవ్రమనస్థాపం చెంది హైబీపీతో ఉన్న నాన్నమ్మను కూడా పట్టించుకోకుండా, తండ్రి ఆవేదనను అర్థం చేసుకోకుండా పయనమైన బిడ్డలను చూసి ‘ఎన్నో కథలు, నవలలు రాశాను.. వాటన్నింటినీ సమాజం ఆమోదించింది.. అవి చదివి తమ సంసారాలను బాగు చేసుకున్న వారు ఫోన్లు చేసి ఇప్పటికీ నన్ను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంట గెలచి రచ్చ గెలవమంటారు.. మరి నేను రచ్చ గెలిచానా? అలా భ్రమపడ్డానా? ఇంట మాత్రం ఓడిపోయాను.. నా పెంపకంలో లోపం కనిపిస్తుంది.. ఇంటిలోని బిడ్డలకు మానవ సంబంధాలు అనుబంధాలు గూర్చి చెప్పలేని నా రచనలు సమాజానికి ఏమి సందేశం ఇవ్వగలవు’ అంటూ మనస్థాపం చెంది తన రచనలన్నీ తగలబెట్టబోయాడు విశ్వం.
ఇంతలో ఇది గమనించిన విశ్వం తండ్రి రాఘవయ్య తన శక్తిని అంతా కూడగట్టుకుని విశ్వాన్ని నివారించి మనవళ్ళని ఉద్దేశించి విశ్వం తమకు చేస్తున్న సేవలు వివరిస్తూ ‘ఒరేయ్.. మనవళ్ళు.. మీ నాన్న గురించి ఏమి చెప్పినా తక్కువే ఆఖరికి మాకు స్నానాలు చేయించి మాకు బట్టలు మార్చేది కూడా నా బిడ్డ విశ్వంరా.. వాడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే.. ఒరేయ్ విశ్వం నేను చచ్చిపోతే నీవు ఏడుస్తావు కదూ? అని నేనంటే.. ఏడవను అన్నాడు. నేను ఆశ్చర్యపోయి ఎందుకు? అని అడిగాను. దానికి అప్పుడు వాడు ఇచ్చిన సమాధానం.. మీరు చనిపోతే నేను ఏడ్చేది మీరు చూడలేరు కదానాన్న.. కాని మీరు బ్రతికున్నంత వరకు మీ జీవితాంతం మీ కంటిలో కన్నీరు కారకుండా చూసుకుంటాను అన్నాడు రా.. అప్పటినుండి ఇప్పటివరకు ఆ శ్రవణ కుమారుడు తమ వృద్ధ తల్లిదండ్రులని తన భుజాన మోసినట్లు వాడు చెప్పినట్లుగానే కంటిలో కన్నీరు కారకుండా చూసుకుంటున్నాడు రా.. వాడి ప్రేమ విశ్వవ్యాప్తం.. ఇలాంటి కొడుకు ఉన్న తల్లిదండ్రులు నిండు నూరేళ్లు బ్రతుకుతారు..
విశ్వం మాకు ఇచ్చింది డబ్బులు కాదు ప్రేమ.. అదే ప్రేమ రేపు మీ బిడ్డలు మీకు పంచాలి.. అలా పంచగలిగేటట్లు మీ పెంపకం ఉండాలి’ అని రాఘవయ్య ఆవేదనతో వణుకుతున్న గొంతుతో అనగానే తమది వక్రబుద్ధి అని గ్రహించి ఆలోచనలో పడ్డ ప్రకాష్ వినోద్ లు విశ్వం వద్దకొచ్చి చేతిలో ఉన్న అగ్గిపెట్టిని లాగేసుకుని తలదించుకుంటారు. వారిలో పశ్చాత్తాపం గమనించిన విశ్వం ‘మానవుని అంతిమ లక్ష్యం సంతృప్తి.. అది ఆస్తుల వల్ల డబ్బుల వల్ల రాదు.. ప్రేమ అనురాగం, ఆప్యాయతలు ఆత్మీయతల వల్లే సంతృప్తి వస్తుంది.. వంశవృక్షానికి మూలమైన పెద్దవారిని కంటికి రెప్పలా చూసుకునే తత్వం ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే ఆ వంశవృక్షం ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా పెరిగి సమాజానికి వెలుగునివ్వడమే కాకుండా ఆదర్శవంతంగా ఉంటుంది.’ అని విశ్వం అంటుండగా ‘మమ్మల్ని క్షమించండి నాన్న మా తప్పు గ్రహించాం..
మీతో పాటు నానమ్మ తాతయ్యలు మాకు దైవ సమానం’ అంటూ ప్రకాష్ వినోద్ లు తండ్రి యొక్క రచనల పుస్తకాలు అన్నిటిని ఒక చోటికి చేర్చి తండ్రి సన్మాన మహోత్సవంలో బహుకరించిన మొక్కని వాటిపై ఉంచి ‘అభ్యుదయ భావాలతో సమాజ సౌభాగ్యానికి మీరు చేసిన రచనలు ప్రచారం చేయడంలో మేము.. మీ వెంటే ఉంటాం’. అంటూ ప్రమాణం చేస్తారు. దీనితో విశ్వం విశ్వసించిన వంశవృక్ష ఫలం సిద్ధించినట్లు అవుతుంది.
@ శుభం @

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.