ఏడునూతుల: నవంబర్ 7:
జెడ్పీహెచ్‌ఎస్ ఏడునూతుల పాఠశాలలో వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సమూహంగా వందేమాతరం గీతాన్ని ఆలపించి దేశభక్తి గీతాలతో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వందేమాతరం గీతం చరిత్ర, దాని ప్రాముఖ్యత, మరియు స్వాతంత్ర్య సంగ్రామంలో దాని పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు దేశభక్తి నినాదాలతో పాఠశాల ఆవరణాన్ని మారుమోగించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు.


