వందేమాతరం గేయం రచించబడిన 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం… ఈరోజు శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట సామూహిక వందేమాతరం గేయం ఆలాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ…
1875లో బంకిమ్ చంద్ర చటర్జీ గారు రచించిన “వందేమాతరం” గేయం అప్పటి బ్రిటిష్ వలస పాలకులకు గుండెల్లో వణుకు పుట్టించిన గేయం అని
“వందేమాతరం” ఒక మాట కాదు… స్వాతంత్ర సమరయోధుల చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం అవుతూ వేలాది మందిలో దేశభక్తిని రగిల్చిందని వివరించారు.
150 సంవత్సరాల ఈ ప్రత్యేక సందర్భంలో
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు మరొకసారి వందనం తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు యువతకు పిలుపునిస్తూ…
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి
స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో – వందేమాతరం భావంతో
దేశ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టే సాయి ప్రసాద్,కుమార్, గరికపాటి, చంద్ర, జయప్రకాష్, మహేష్, ఢిల్లీ బాబు, సురేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు


