అమలాపురంలో కొంకాపల్లి ఎత్తు రోడ్డులో కోనసీమ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్& రేడియోలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన ఆదివారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముత్తా బత్తుల ప్రమోద్ కుమార్ మరియు సెక్రటరీ కాండ్రేగుల సోమేశ్ ఆధ్వర్యంలో ఈ వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మలేరియా అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లా స్టాటిస్టికల్ అధికారి కె.వీరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ టెక్నీషియన్ తప్పనిసరిగా పారామెడికల్ బోర్డ్ లో రిజిస్టర్ అయి ఉండాలని అన్నారు. ఖచ్చితమైన ల్యాబ్ రిపోర్టు ఇవ్వాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ టెక్నీషియన్లు అందరు ఐక్యతగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ జి.చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ లు దాసం ప్రసాద్, జి.మొహన్ కృష్ణ, జి.రామస్వామి నాయుడు, జాయింట్ సెక్రెటరీ ఎం.సునీల్ శాస్త్రి, కో ట్రెజరర్ ఎం. శ్రీకృష్ణ, రాయుడు శంకర్ మరియు అసోసియేషన్ సభ్యులు, జిల్లాలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.


