Saturday, 4 April 2026
  • Home  
  • *లౌకికవాదం విషయంలో రాజీపడం* *కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌*
- ఆంధ్రప్రదేశ్

*లౌకికవాదం విషయంలో రాజీపడం* *కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌*

తిరువనంతపురం: ఏ దశలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా లౌకికవాదం విషయంలో ఎల్డీఎఫ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పునరుద్ఘాటించారు. తిరువనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్డీఎఫ్‌ అనుసరిస్తున్న దఢమైన మతతత్వ వ్యతిరేక వైఖరి కారణంగానే గత పదేండ్లుగా కేరళలో మత ఘర్షణలు, హింసకు తావు లేకుండా ప్రశాంతత నెలకొని ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎస్‌డీపీఐ మద్దతును ఎల్డీఎఫ్‌ కోరిందన్న ఆరోపణలను ముఖ్యమంత్రి పూర్తిగా తిరస్కరించారు. నెమోం నియోజకవర్గంలో ఎస్‌డీపీఐ సహాయాన్ని ఎల్డీఎఫ్‌ కోరలేదని స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గంలోని ప్రత్యేక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. 2016లో నెమోంలో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్‌ పరోక్షంగా మార్గం సుగమం చేసిందని, అయితే 2021లో ఎల్డీఎఫ్‌ మాత్రం బీజేపీ ఖాతాను మూసివేసిందని ఆయన గుర్తుచేశారు. కేరళలోనూ, దేశవ్యాప్తంగానూ బీజేపీ గెలవకూడదని కోరుకునే శక్తులు అనేకం ఉన్నాయని, బీజేపీని ఓడించడానికి అత్యంత విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం ఎల్డీఎఫ్‌ మాత్రమేనని గుర్తించి ప్రజలు దానికి ఓటు వేస్తున్నారని ఆయన తెలిపారు. రాజకీయంగా ఎల్డీఎఫ్‌తో అన్ని విషయాల్లో ఏకీభవించని వారు కూడా బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసమే దానికి ఓటు వేశారని, ఇది ఏ రహస్య ఒప్పందం లేదా బేరసారాల ఫలితం కాదని ఆయన స్పష్టం చేశారు. కేరళ అభివృద్ధికి సంబంధించిన చర్చను ఎదుర్కోలేని వారే ఇలాంటి ‘కృత్రిమ ఆరోపణల తెర’ను సృష్టించాల్సిన అవసరం ఏర్పడుతోందని పినరయి విజయన్‌ అన్నారు. ”ఎటువంటి ఆరోపణల తెర మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ఏ మతతత్వ శక్తిపైనా ఆధారపడాల్సిన అవసరం మాకు లేదు. అటువంటి ఆరోపణలను మాపై మోపగలమని ఎవరూ భ్రమపడకూడదు.” అని స్పష్టం చేశారు. వామపక్షాలు ఎల్లప్పుడూ మతతత్వానికి వ్యతిరేకంగానే నిలిచాయని, మతతత్వ శక్తులతో ఎప్పుడూ ఏ ఒప్పందంలోనూ భాగస్వామ్యం కాలేదని ఆయన అంతే దృఢంగా స్పష్టం చేశారు. ”చరిత్రను పరిశీలించండి. ఆ ప్రశ్నకు అదే సమాధానం చెబుతుంది,” అని ఆయన సూటిగా వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్‌, బీజేపీలకు అనుకూలంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ చరిత్ర అందరికీ తెలిసిందేనని, కాంగ్రెస్‌ నేటికీ తన పాత ‘మృదు హిందుత్వ’ విధానాన్నే కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మాయమాటల ప్రచారాలు ఎల్‌డీఎఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపలేవని ఆయన నొక్కిచెప్పారు.వామపక్షంపై తప్పుడు చిత్రాన్ని గీయడానికి మితవాద వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, అటువంటి ప్రచారం వారిని ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. తాము కోరుకున్న సమాధానాలు లభించకపోవడంతో మీడియాలో నెలకొన్న నిరాశ కూడా స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్‌డీఎఫ్‌ మతతత్వ శక్తుల ఓట్లను కోరుకోవడం లేదని పునరుద్ఘాటిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఈ రాష్ట్రం ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన ముప్పు అయిన మెజారిటీ మతతత్వాన్ని వామపక్షాలు తమ చరిత్ర పొడవునా స్థిరంగా వ్యతిరేకించాయని, మైనారిటీలను రక్షించడానికి పటిష్టమైన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ఎల్‌డీఎఫ్‌ మెజారిటీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తోందని చిత్రీకరించే ఏ ప్రయత్నమూ సఫలం కాదని ఆయన అన్నారు.

తిరువనంతపురం: ఏ దశలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా లౌకికవాదం విషయంలో ఎల్డీఎఫ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పునరుద్ఘాటించారు. తిరువనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్డీఎఫ్‌ అనుసరిస్తున్న దఢమైన మతతత్వ వ్యతిరేక వైఖరి కారణంగానే గత పదేండ్లుగా కేరళలో మత ఘర్షణలు, హింసకు తావు లేకుండా ప్రశాంతత నెలకొని ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎస్‌డీపీఐ మద్దతును ఎల్డీఎఫ్‌ కోరిందన్న ఆరోపణలను ముఖ్యమంత్రి పూర్తిగా తిరస్కరించారు. నెమోం నియోజకవర్గంలో ఎస్‌డీపీఐ సహాయాన్ని ఎల్డీఎఫ్‌ కోరలేదని స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గంలోని ప్రత్యేక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. 2016లో నెమోంలో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్‌ పరోక్షంగా మార్గం సుగమం చేసిందని, అయితే 2021లో ఎల్డీఎఫ్‌ మాత్రం బీజేపీ ఖాతాను మూసివేసిందని ఆయన గుర్తుచేశారు. కేరళలోనూ, దేశవ్యాప్తంగానూ బీజేపీ గెలవకూడదని కోరుకునే శక్తులు అనేకం ఉన్నాయని, బీజేపీని ఓడించడానికి అత్యంత విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం ఎల్డీఎఫ్‌ మాత్రమేనని గుర్తించి ప్రజలు దానికి ఓటు వేస్తున్నారని ఆయన తెలిపారు. రాజకీయంగా ఎల్డీఎఫ్‌తో అన్ని విషయాల్లో ఏకీభవించని వారు కూడా బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసమే దానికి ఓటు వేశారని, ఇది ఏ రహస్య ఒప్పందం లేదా బేరసారాల ఫలితం కాదని ఆయన స్పష్టం చేశారు.
కేరళ అభివృద్ధికి సంబంధించిన చర్చను ఎదుర్కోలేని వారే ఇలాంటి ‘కృత్రిమ ఆరోపణల తెర’ను సృష్టించాల్సిన అవసరం ఏర్పడుతోందని పినరయి విజయన్‌ అన్నారు. ”ఎటువంటి ఆరోపణల తెర మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ఏ మతతత్వ శక్తిపైనా ఆధారపడాల్సిన అవసరం మాకు లేదు. అటువంటి ఆరోపణలను మాపై మోపగలమని ఎవరూ భ్రమపడకూడదు.” అని స్పష్టం చేశారు. వామపక్షాలు ఎల్లప్పుడూ మతతత్వానికి వ్యతిరేకంగానే నిలిచాయని, మతతత్వ శక్తులతో ఎప్పుడూ ఏ ఒప్పందంలోనూ భాగస్వామ్యం కాలేదని ఆయన అంతే దృఢంగా స్పష్టం చేశారు. ”చరిత్రను పరిశీలించండి. ఆ ప్రశ్నకు అదే సమాధానం చెబుతుంది,” అని ఆయన సూటిగా వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్‌, బీజేపీలకు అనుకూలంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ చరిత్ర అందరికీ తెలిసిందేనని, కాంగ్రెస్‌ నేటికీ తన పాత ‘మృదు హిందుత్వ’ విధానాన్నే కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మాయమాటల ప్రచారాలు ఎల్‌డీఎఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపలేవని ఆయన నొక్కిచెప్పారు.వామపక్షంపై తప్పుడు చిత్రాన్ని గీయడానికి మితవాద వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, అటువంటి ప్రచారం వారిని ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. తాము కోరుకున్న సమాధానాలు లభించకపోవడంతో మీడియాలో నెలకొన్న నిరాశ కూడా స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్‌డీఎఫ్‌ మతతత్వ శక్తుల ఓట్లను కోరుకోవడం లేదని పునరుద్ఘాటిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఈ రాష్ట్రం ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన ముప్పు అయిన మెజారిటీ మతతత్వాన్ని వామపక్షాలు తమ చరిత్ర పొడవునా స్థిరంగా వ్యతిరేకించాయని, మైనారిటీలను రక్షించడానికి పటిష్టమైన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ఎల్‌డీఎఫ్‌ మెజారిటీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తోందని చిత్రీకరించే ఏ ప్రయత్నమూ సఫలం కాదని ఆయన అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.