పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్)
ఖమ్మం
జాతీయ లోక్ ఆడాలాత్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 4625 కేసులు పరిష్కారం అయ్యాయి అని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలియజేసారు. రాజీ కీ అవకాశం ఉండి పరిష్కారం అయ్యే కేసులని జాతీయ లోక్ అదాలత్ ద్వారా 4625 కేసులు పరిష్కారం చేశామని వీటిలో FIR కేసులు 712,ఈ పెట్టి కేసులు 775, డ్రంక్ & డ్రైవ్ కేసులు 2972, మైనర్ డ్రైవింగ్ లు 8, సైబర్ కేసులు 158 కేసులని జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడినట్లు అలాగే మొత్తం 52,11,246 రూపాయలు బాధితులకి అంద జేసినట్లు కమిషనర్ సునీల్ దత్ తెలియజేసారు.


