– జాబ్ క్యాలెండర్ విడుదలపై రైల్వేకోడూరులో ‘తెలుగుయువత’ సంబరాలు
– మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం
– యువగళం హామీని నిలబెట్టుకున్న యువనేత: ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగుల చిరకాల స్వప్నమైన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం పట్ల రైల్వేకోడూరు నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉగాది పండుగ కానుకగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, శుక్రవారం కోడూరు పట్టణంలో తెలుగుయువత ఆధ్వర్యంలో ఘనంగా కృతజ్ఞతా సభ నిర్వహించారు.
మాట తప్పని నేత – నిలబెట్టుకున్న భరోసా:
రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల చైర్మన్, తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కేకే చౌదరి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతతో కలిసి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలుగుయువత నాయకులు మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన ప్రతి హామీని నేడు అధికారంలోకి వచ్చాక తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ జాబ్ క్యాలెండర్ ఒక వరమని హర్షం వ్యక్తం చేశారు.
నిరుద్యోగుల గొంతుకగా లోకేష్:
విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న లోకేష్ , అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీతో పాటు వరుస నోటిఫికేషన్ల షెడ్యూల్ విడుదల చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతలో మళ్లీ ఆశలు చిగురించాయని, త్వరలోనే ఇంటికో ఉద్యోగం అనే లక్ష్యం నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పాల్గొన్న ముఖ్య నేతలు:
ఈ కార్యక్రమంలో గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పులేల రమేష్ బాబు, టీడీపీ నేత నార్జాల హేమరాజ్, మండల ప్రధాన కార్యదర్శులు చప్పిడి రమేష్ బాబు, తేనెపల్లి నరసింహులు (చిన్నా) పాల్గొన్నారు.
తెలుగుయువత ప్రతినిధులు:
పోతురాజు సుమన్ రాయల్, మడుపూరి నరేష్, బుంగటావుల రాజశేఖర్, బొబ్బే దునుంజయ యాదవ్, మించల బాలకృష్ణ యాదవ్, హేమంత్ రాయల్, కాకర్ల రెడ్డయ్య, మోసాటి హరినాధ రెడ్డి, తుంగా నవీన్, ఈశ్వర్ యాదవ్, కట్టా గిరిబాబు, పోలిన గణేష్, బాలు నాగేంద్ర, టీఎన్ఎస్ఎఫ్ శివ, బాలాజీ, కస్తూరి జగదీష్, దిలీప్, కట్టా శివ, పాలురి సుధాకర్, మద్దిన రమేష్, మన్నూరు తేజ తదితర ముఖ్య కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.


