1ముఖ్య అతిథులుగా పొట్లూరి హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ డి.ఈ రమేష్ కుమార్
తెలుగు భాషా అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం – వడ్డి సుధాకర్


లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వడ్డి సుధాకర్ అధ్యక్షతన హిందూపురంలోని శ్రీ శేఖర్ అకాడమీ నందు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ ముందస్తు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జానపద కలళ అకాడమీ తొలి అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ, హిందూపురం మునిసిపల్ ఛైర్మన్ డి.ఈ రమేష్ కుమార్ పాల్గొని తెలుగు భాష పట్ల అంకితభావంతో పనిచేస్తున్న లేపాక్షి ఫౌండేషన్ సేవలను కొనియాడారు.ప్రతి ఒక్కరూ తెలుగు భాష అభ్యున్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. లేపాక్షి ఫౌండేషన్ చైర్మన్ వడ్డి సుధాకర్ మాట్లాడుతూ తెలుగు భాష అభ్యున్నతికి అభివృద్ధికి లేపాక్షి ఫౌండేషన్ ముందుంటుందని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలియజేస్తూ కవులకు తెలుగు భాషా పురస్కారాలను, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అతిధుల చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ మండల విద్యాధికారి గంగప్ప కౌన్సిలర్ దుర్గా నవీన్, లేపాక్షి ఫౌండేషన్ సభ్యులు ధనాశి ఉషారాణి,చంద్రశేఖర్,అశోక్ కుమార్,శశికళ,విజయ్ కుమార్ పలు జిల్లాల కవులు విజేతలు పెద్ద ఎత్తున తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఘన సన్మానం చేశారు

