(పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ స్టాంప్ & రిజిస్ట్రేషన్ కమిషనర్ డా. అంబేద్కర్ గారిని ఫెడరేషన్ అఫ్ ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా, లీగల్ అవార్డుల మంజూరు ప్రక్రియలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు ఆలస్యం చేస్తున్నారని తెలియజేయగా, కమిషనర్ గారు వెంటనే స్పందించి అన్ని జిల్లా రిజిస్ట్రార్లకు త్వరితగతిన అవార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఫెడరేషన్ తరపున కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ —
🔹 శ్రీహరి గారు – సెక్రటరీ
🔹 రవివర్మ గారు – కమిటీ సభ్యుడు
🔹 మోహన్ గారు – ట్రెజరర్
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


