పున్నమి ప్రతినిధి ఆగస్టు 31
నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం లింగసానిపల్లి బ్రిడ్జి తో 8 గ్రామాల ప్రజల,రైతుల ,విద్యార్థుల చిరకాల స్వప్నం సాకారం*
ఈరోజు గత ప్రభుత్వంలో 3.5 కోట్లతో నిర్మించిన లింగసానిపల్లి వంతెనపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్,మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన ఆయా గ్రామాల ప్రజలు*
*“దశాబ్దాలుగా ఎదురుచూసిన ఈ బ్రిడ్జి మా గ్రామాలకు ఊపిరి పోసింది. రవాణా సౌకర్యాలు మెరుగుపడి, విద్యార్థులకు, రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని మా తరతరాలు గుర్తుంచుకుంటాయి” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.*
*నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని,లింగసానిపల్లి,వసంతపూర్,కుమ్మెర,కార్కొండ,పర్వతాయిపల్లి,తుమ్మలసుగూర్,యత్మతాపూర్,పోతిరెడ్డిపల్లి,8 గ్రామాల ప్రజల,రైతుల,విద్యార్థుల చిరకాల స్వప్నం అయిన లింగసానిపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. ఈ బ్రిడ్జిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి సహకారంతో రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మించారు.*
*ఈరోజు బ్రిడ్జిపై 8 గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.*
ప్రజలు మాట్లాడుతూ –
*“ వర్షాకాలంలో,పాలెం చెరువు అలుగు పారితే వచ్చే వరద ప్రవాహం వల్ల లింగసానిపల్లి దగ్గర 8 గ్రామాల రవాణా వ్యవస్థ బందు అవుతుందని,గత ఎన్నోదశాబ్దాల నుంచి ఎన్నో ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదు అని అన్నారు,**తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత TRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య గురించి 8 గ్రామాల ప్రజలతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి మాజీ సీఎం కేసీఆర్ గారి సహకారంతో బ్రిడ్జి నిర్మాణం కోసం 3 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయడంతో…*
లింగసానిపల్లి బ్రిడ్జి నిర్మాణం వల్ల రవాణా సౌకర్యాలు సులభతరం కావడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకు సులభంగా చేరే మార్గం ఏర్పడింది. విద్యార్థుల విద్య, గ్రామాల అభివృద్ధి కొత్త దిశలో ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేశారు.*
*ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల,ప్రజలు,రైతులు,పలువురు BRS పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*


