Thursday, 5 February 2026
  • Home  
  • లావిష్ బ్యూటీ సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ దాడి — పోలీసుల అదుపులో యాజమాన్యం
- విశాఖపట్నం

లావిష్ బ్యూటీ సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ దాడి — పోలీసుల అదుపులో యాజమాన్యం

గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల Lavishe Hair & Beauty Center పై ముమ్మర దాడులు నిర్వహించారు.ఈ రోజు (10.10.2025) సాయంత్రం 6 గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ సీఐ, ఎస్‌ఐ భరత్ కుమార్ రాజు మరియు సిబ్బంది ఈ దాడి చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందడంతో దాడులు నిర్వహించగా, అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు తేలింది. దాడి సమయంలో పోలీసులు Lavishe సెంటర్ యాజమాన్యం ముగ్గురు వ్యక్తులను, ముగ్గురు విటులను, ఒక హెల్పర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ముగ్గురు బాధిత మహిళలను సేఫ్ కస్టడీ నిమిత్తం రక్షణలోకి తీసుకున్నారు. తరువాత వారిని దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు అప్పగించి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అయితే ఈ స్పా నిర్వాహకులుగా కిల్లాడ ప్రవీణ్ (28) — రాజీవ్ నగర్, దువ్వాడ, విశాఖపట్నం. యెజ్జపురపు దమయంతి (38) — పార్క్ హోటల్ జంక్షన్, బీచ్ రోడ్, విశాఖపట్నం. స్వస్థలం: దుమ్మెడ గ్రామం, గరివిడి మండలం. కొసనం హైమవతి (30) — కుంచిమాంబ కాలనీ, గాజువాక. వారి గా ఉన్నట్లు, సహాయకుడుగా అమిత్ గౌతమ్ (28), రాజీవ్ నగర్, దువ్వాడ. ఉన్నట్టు తెలిపారు. నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ మాట్లాడుతూ — “Lavishe బ్యూటీ సెంటర్ నిర్వహిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, వ్యభిచారం జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి స్పా సెంటర్లపై ముమ్మర తనిఖీలు కొనసాగుతాయి” అని పేర్కొన్నారు. అలాగే ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ : “మీ పరిసర ప్రాంతాల్లో లేదా స్పా సెంటర్లలో అనధికారిక వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే డయల్ 100 / 112, లేదా సీపీ గారి ఫోన్ నంబర్ 7995095799, లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇవ్వండి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి,” అని తెలిపారు.

గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి):

నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల Lavishe Hair & Beauty Center పై ముమ్మర దాడులు నిర్వహించారు.ఈ రోజు (10.10.2025) సాయంత్రం 6 గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ సీఐ, ఎస్‌ఐ భరత్ కుమార్ రాజు మరియు సిబ్బంది ఈ దాడి చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందడంతో దాడులు నిర్వహించగా, అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు తేలింది. దాడి సమయంలో పోలీసులు Lavishe సెంటర్ యాజమాన్యం ముగ్గురు వ్యక్తులను, ముగ్గురు విటులను, ఒక హెల్పర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ముగ్గురు బాధిత మహిళలను సేఫ్ కస్టడీ నిమిత్తం రక్షణలోకి తీసుకున్నారు.
తరువాత వారిని దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు అప్పగించి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అయితే ఈ స్పా నిర్వాహకులుగా
కిల్లాడ ప్రవీణ్ (28) — రాజీవ్ నగర్, దువ్వాడ, విశాఖపట్నం.
యెజ్జపురపు దమయంతి (38) — పార్క్ హోటల్ జంక్షన్, బీచ్ రోడ్, విశాఖపట్నం. స్వస్థలం: దుమ్మెడ గ్రామం, గరివిడి మండలం. కొసనం హైమవతి (30) — కుంచిమాంబ కాలనీ, గాజువాక. వారి గా ఉన్నట్లు, సహాయకుడుగా
అమిత్ గౌతమ్ (28), రాజీవ్ నగర్, దువ్వాడ. ఉన్నట్టు తెలిపారు.

నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ మాట్లాడుతూ —
“Lavishe బ్యూటీ సెంటర్ నిర్వహిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, వ్యభిచారం జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి స్పా సెంటర్లపై ముమ్మర తనిఖీలు కొనసాగుతాయి” అని పేర్కొన్నారు.

అలాగే ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ :
“మీ పరిసర ప్రాంతాల్లో లేదా స్పా సెంటర్లలో అనధికారిక వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే డయల్ 100 / 112, లేదా సీపీ గారి ఫోన్ నంబర్ 7995095799, లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇవ్వండి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి,” అని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.