భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని 15 వ తేదీ సోమవారం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఈ. ఎస్.సి.ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఘనంగా నిర్వహించారు.నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సభా కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్,డాక్టర్ గెలిచి సహదేవుడు,డాక్టర్ రవి కృష్ణ అతిథులుగా పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలు వివరించారు.ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో, అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర విశిష్టమైనదని అన్నారు. డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్య బయో మెడికల్ ఇంజనీరింగ్ లో, వ్యవసాయ రంగంలో, సమాచారం విప్లవంలో ఇంజనీర్ల పాత్ర అద్వితీయ మైనదని అన్నారు.డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సౌజన్యంతో ముగ్గురు ఇంజనీరింగ్ అధ్యాపకులకు పురస్కారాలు, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు, అందజేశారు.కళాశాల సీనియర్ అధ్యాపకులు సంజీవ రాయుడు, విద్యా శ్రీ, సాయినాధ రెడ్డి లను శాలువా,జ్ఞాపికలతో సత్కరించి, లయన్స్ క్లబ్ జాతీయ ఇంజనీర్స్ దినోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, కార్యక్రమ స్పాన్సర్, రీజియన్ చైర్మన్ పీ.వీ.సుధాకర్ రెడ్డి,లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్, సభ్యులు మేడం చంద్రశేఖర్, కళాశాల అధ్యాపకులు రఘునాథరెడ్డి,రాజేష్, ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు.
**వక్తృత్వ పోటీలు ..*
“భవిష్యత్ భారత దేశం లో ఇంజినీర్ల పాత్ర” అన్న అంశంపై నిర్వహించిన వక్తృత్వపు పోటీలో వరస బహుమతులు సాధించిన రమ్యశ్రీ,సాయి హృతిక్, శ్రీవల్లి, హర్షియా,లిఖిత్ చందు,మహమ్మద్ సుఫియాన్ లకు బహుమతులు అందజేయడం జరిగింది.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవం
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని 15 వ తేదీ సోమవారం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఈ. ఎస్.సి.ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఘనంగా నిర్వహించారు.నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సభా కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్,డాక్టర్ గెలిచి సహదేవుడు,డాక్టర్ రవి కృష్ణ అతిథులుగా పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలు వివరించారు.ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో, అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర విశిష్టమైనదని అన్నారు. డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్య బయో మెడికల్ ఇంజనీరింగ్ లో, వ్యవసాయ రంగంలో, సమాచారం విప్లవంలో ఇంజనీర్ల పాత్ర అద్వితీయ మైనదని అన్నారు.డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సౌజన్యంతో ముగ్గురు ఇంజనీరింగ్ అధ్యాపకులకు పురస్కారాలు, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు, అందజేశారు.కళాశాల సీనియర్ అధ్యాపకులు సంజీవ రాయుడు, విద్యా శ్రీ, సాయినాధ రెడ్డి లను శాలువా,జ్ఞాపికలతో సత్కరించి, లయన్స్ క్లబ్ జాతీయ ఇంజనీర్స్ దినోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, కార్యక్రమ స్పాన్సర్, రీజియన్ చైర్మన్ పీ.వీ.సుధాకర్ రెడ్డి,లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్, సభ్యులు మేడం చంద్రశేఖర్, కళాశాల అధ్యాపకులు రఘునాథరెడ్డి,రాజేష్, ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు. **వక్తృత్వ పోటీలు ..* “భవిష్యత్ భారత దేశం లో ఇంజినీర్ల పాత్ర” అన్న అంశంపై నిర్వహించిన వక్తృత్వపు పోటీలో వరస బహుమతులు సాధించిన రమ్యశ్రీ,సాయి హృతిక్, శ్రీవల్లి, హర్షియా,లిఖిత్ చందు,మహమ్మద్ సుఫియాన్ లకు బహుమతులు అందజేయడం జరిగింది.

