సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ దిల్లీ:
లంచం తీసుకొంటూ పట్టుబడిన ఓ పోలీసు అధికారి ఆ డబ్బును గాల్లోకి విసిరేయడంతో చుట్టూ ఉన్న జనం అందినకాడికి ఎత్తుకొని ఉడాయించారు. దిల్లీకి చెందిన ఏఎస్ఐ రాకేశ్ కుమార్ రూ.15,000 ఇవ్వకపోతే తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నారని ఇటీవల ఓ వ్యక్తి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ అధికారిని రెడ్్యండెడ్గా పట్టుకోవాలనే పథకంతో విజిలెన్స్ అధికారులు రసాయన పొడి చల్లిన నోట్లను ఫిర్యాదికి ఇచ్చారు. స్థానిక హౌజ్ ఖాజీ పోలీస్టేషను సమీపంలో మంగళవారం ఏఎస్ఐకు బాధితుడు సొమ్ము అందజేశారు. విజిలెన్స్ అధికారుల రాకను గమనించిన రాకేశ్ కుమార్ ఆధారాలను నాశనం చేయడానికి లంచంగా తీసుకున్న నోట్లను గాల్లోకి విసిరారు. ఎగబడిన జనాన్ని వారించి మిగతా డబ్బు స్వాధీనం చేసుకున్న అధికారులు ఏఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు.

లంచం సొమ్మును గాల్లోకి విసిరేసిన ఏఎస్ఐ
సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ దిల్లీ: లంచం తీసుకొంటూ పట్టుబడిన ఓ పోలీసు అధికారి ఆ డబ్బును గాల్లోకి విసిరేయడంతో చుట్టూ ఉన్న జనం అందినకాడికి ఎత్తుకొని ఉడాయించారు. దిల్లీకి చెందిన ఏఎస్ఐ రాకేశ్ కుమార్ రూ.15,000 ఇవ్వకపోతే తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నారని ఇటీవల ఓ వ్యక్తి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ అధికారిని రెడ్్యండెడ్గా పట్టుకోవాలనే పథకంతో విజిలెన్స్ అధికారులు రసాయన పొడి చల్లిన నోట్లను ఫిర్యాదికి ఇచ్చారు. స్థానిక హౌజ్ ఖాజీ పోలీస్టేషను సమీపంలో మంగళవారం ఏఎస్ఐకు బాధితుడు సొమ్ము అందజేశారు. విజిలెన్స్ అధికారుల రాకను గమనించిన రాకేశ్ కుమార్ ఆధారాలను నాశనం చేయడానికి లంచంగా తీసుకున్న నోట్లను గాల్లోకి విసిరారు. ఎగబడిన జనాన్ని వారించి మిగతా డబ్బు స్వాధీనం చేసుకున్న అధికారులు ఏఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు.

