Friday, 6 February 2026
  • Home  
  • ర్యాగింగ్ పై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న : కలెక్టర్
- తెలంగాణ

ర్యాగింగ్ పై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు విద్యార్థుల నుండి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అయినప్పటికీ ఈ విషయంపై జిల్లా యంత్రాంగం విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. తమ చర్చల్లో సీనియర్ విద్యార్థులు,జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకమైన వాతావరణంలోనే మెలిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ శుక్రవారం స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డిలతో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ,హెచ్ ఓ డి లు, అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, మెంటర్లు, విద్యార్థులతో ఆమె విడివిడిగా చర్చించారు. మీడియాలో వచ్చిన వార్తల దృశ్య నిజంగా వైద్య కళాశాలలో జరిగిన సంఘటనలను వివరించాలని ఆమె విద్యార్థులను అడిగారు. తమను ఎవరు ర్యాగింగ్ చేయలేదని స్నేహపూర్వక వాతావరణం లోనే ఉన్నామని విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు విద్యార్థుల నుండి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అయినప్పటికీ ఈ విషయంపై జిల్లా యంత్రాంగం విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. తమ చర్చల్లో సీనియర్ విద్యార్థులు,జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకమైన వాతావరణంలోనే మెలిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ శుక్రవారం స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డిలతో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ,హెచ్ ఓ డి లు, అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, మెంటర్లు, విద్యార్థులతో ఆమె విడివిడిగా చర్చించారు. మీడియాలో వచ్చిన వార్తల దృశ్య నిజంగా వైద్య కళాశాలలో జరిగిన సంఘటనలను వివరించాలని ఆమె విద్యార్థులను అడిగారు. తమను ఎవరు ర్యాగింగ్ చేయలేదని స్నేహపూర్వక వాతావరణం లోనే ఉన్నామని విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.