Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

రౌడీషీటర్లకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్ అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్య

Punnami Newsroom Published:
రౌడీషీటర్లకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్ అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్య

గాజువాక, అక్టోబర్ 25 (పున్నమి ప్రతినిధి):

జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై గాజువాక పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం గాజువాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.

విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు, గాజువాక సీఐ సీహెచ్‌. వాసు నాయుడు సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా వ్యవహరించాలని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, గొడవలకు దిగడం, ఇతరులను బెదిరించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడడం వంటి వాటిని సహించబోమని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ద్వారా తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రౌడీషీటర్లకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్ అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్య

రౌడీషీటర్లకు గాజువాక పోలీసుల కౌన్సెలింగ్ అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్య

Leave a comment

Your email address will not be published. Required fields are marked *