*రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి*
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి * నగరంలో చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాన్వెంట్ జంక్షన్ నుంచి ఐ.ఎన్.ఎస్. డేగ, పోర్టు డాక్ ఏరియా వరకు చేపడుతున్న రోడ్డు పనులను జీవీఎంసీ, ఎన్.హెచ్. విభాగాల అధికారులతో కలిసి శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. పార్టెనర్షిప్ సమ్మిట్ నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని, వేగంగా వేయాలనే కారణంతో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. అన్ని ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేయాలని చెప్పారు. సంబంధిత విభాగాల అధికారులు పనులను నిత్యం పర్యవేక్షించాలని, నిర్ణీత సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు జీవీఎంసీ సీఈ సత్యనారాయణ రాజు, ఎస్.ఈ., జాతీయ రహదారుల విభాగం అధికారులు ఉన్నారు.


