Thursday, 5 February 2026
  • Home  
  • రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు కమిషనర్ హెచ్చరిక
- E-పేపర్

రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు కమిషనర్ హెచ్చరిక

కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ,పున్నమి ప్రతినిధి:నగరంలో కాలువల్లో,రోడ్లపై చెత్త వేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఎన్‌ వి‌ వి సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం ఉదయం జగన్నాధపురం ప్రాంతంలోని 25వ డివిజన్ పరదేశమ్మపేట, నాగరాజుపేటలలో శానిటేషన్ నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి టీ స్టాల్ వద్ద టీ గ్లాసులు రోడ్డుపైన పడేయడం గమనించిన కమిషనర్ సత్యనారాయణ టీ షాప్ యజమానిని పిలిపించి తక్షణమే గ్లాసులు తొలగించాలని ఆదేశించారు.ఇకముందు కూడా చెత్తను రోడ్డుపై పడేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డివిజన్‌లో ప్రజలను పలకరించిన ఇంచార్జ్ కమిషనర్,పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ చెత్త సేకరణకు వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పౌరులు పురమిత్ర యాప్‌ను వినియోగించి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం చాలా అవసరం అన్నారు.నగర ప్రజలకు క్లీన్ సిటీపై అవగాహన కల్పించి వారిని స్వచ్ఛ నగరంలో తీర్చి దిద్దడంలో భాగస్వామ్యం చేస్తామని కమిషనర్ సత్యనారాయణ చెప్పారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్,హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దళే పృథ్వి చరణ్, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ,శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు,శానిటేషన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ,పున్నమి ప్రతినిధి:నగరంలో కాలువల్లో,రోడ్లపై చెత్త వేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఎన్‌ వి‌ వి సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం ఉదయం జగన్నాధపురం ప్రాంతంలోని 25వ డివిజన్ పరదేశమ్మపేట, నాగరాజుపేటలలో శానిటేషన్ నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడి టీ స్టాల్ వద్ద టీ గ్లాసులు రోడ్డుపైన పడేయడం గమనించిన కమిషనర్ సత్యనారాయణ టీ షాప్ యజమానిని పిలిపించి తక్షణమే గ్లాసులు తొలగించాలని ఆదేశించారు.ఇకముందు కూడా చెత్తను రోడ్డుపై పడేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డివిజన్‌లో ప్రజలను పలకరించిన ఇంచార్జ్ కమిషనర్,పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ చెత్త సేకరణకు వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పౌరులు పురమిత్ర యాప్‌ను వినియోగించి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం చాలా అవసరం అన్నారు.నగర ప్రజలకు క్లీన్ సిటీపై అవగాహన కల్పించి వారిని స్వచ్ఛ నగరంలో తీర్చి దిద్దడంలో భాగస్వామ్యం చేస్తామని కమిషనర్ సత్యనారాయణ చెప్పారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్,హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దళే పృథ్వి చరణ్, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ,శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు,శానిటేషన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.