విశాఖపట్నం, నవంబర్ 16: (పున్నమి ప్రతినిధి)
“వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్” సందర్భంగా బ్రహ్మకుమారి సమాజం కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు ప్రమాద బాధితుల స్మరణ సభలో రవాణా శాఖ, ప్రజా రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ—
అతివేగమే రోడ్డు ప్రమాదాల ప్రధాన కారణంగా మారిందని, వేగ నియంత్రణ పాటించకపోవడంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉప రవాణా కమిషనర్ మాట్లాడుతూ—
విశాఖపట్నం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి జరుగుతున్న రోడ్డు భద్రత కమిటీ సమావేశాల్లో ప్రమాదాలకు దారితీసే కారణాలను పరిశీలించి నివారణ చర్యలు చేపడుతున్నాము అన్నారు.
అతివేగం అదుపులో పెట్టడం, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, స్కూల్ పిల్లలను తీసుకెళ్లే ఆటోల్లో అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని సూచించారు.
బ్రహ్మకుమారి సమాజం ప్రతినిధులు మాట్లాడుతూ—
డ్రైవర్లకు ఏకాగ్రత అత్యంత కీలకం అని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి శాంతి కలగాలని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ముగించారు.


