ప్రభుత్వాస్పత్రిలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ టిడిపి మహిళా నాయకురాలు దాసరిరాజు వాణి..
నిన్న రాత్రి లారీ బోల్తా పడి.. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం
రోజూవారీ కూలీ పనుల చేసుకునే వారు, విధి లేని పరిస్థితిల్లో ఆ లారీపై ప్రయాణించడం దురదృష్టకరం..
ఈ ప్రమాదంలో 5 గురు మహిళలు, 4 గురు మగవారు చనిపోయారు..
మరో 5 మందికి గాయాలయ్యాయి… ఇక్కడ స్థానికంగా 4 గురు అడ్మిట్ కాగా, 4 గురిని కడప రిమ్స్ కు రిఫర్ చేయడం, ఒకరిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు..
ఇటువంటి ప్రమాదకర ప్రయాణాలు మంచిది కాదని, ప్రభుత్వాలు చెబుతున్నా,
వారి బతుకు తెరువు కోసం.. ప్రయాణం చేసిన పరిస్థితి..
చనిపోయిన వాళ్లంతా దాదాపుగా ఒకే కుటుంబానికి చెందిన దగ్గర బంధువులునే విషయం.. మనస్సును మరింత కలసివేచిందన్నారు..
గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన రాజంపేట పార్లమెంట్ టిడిపి మహిళా నాయకురాలు దాసరిరాజు వాణి..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆసుపత్రి అధికారులను కలిసి మాట్లాడిన మహిళా నాయకురాలు వాణి
భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోకూడదనే కోరుకుంటున్నామన్నారు…
ఈ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేసిన వాణి..
బాధిత కుటుంబాలను వీలైనంత మేరకు ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ తరపున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.