ప్రమాద కుటుంబాల ఇరువురికి చెరి రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయం..!
వెల్దండ అక్టోబర్ 17 : వెల్దండ మండల పరిధిలోని గానుగట్టు తండా మాజీ సర్పంచ్ పత్యా నాయక్, చెర్కూరు గ్రామానికి చెందిన శ్రీను గురువారం రాత్రి హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారి పై ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి పరామర్శించి తక్షణ సహాయంగా రూ. 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబాలకు అందజేశారు. గోలి శ్రీనివాస్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ నాయకులు నాగులు నాయక్, మాజీ ఎంపీటీసీ భీమయ్యగౌడ్, నరసింహ, జంగిలి నిరంజన్, తగుళ్ళ. కొండల్ యాదవ్, గొడుగు యాదయ్య, జంగిలి ఆనంద్, బర్కం గణేష్, చర్కా కొండల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


