రోడ్డు కిరువైపున పెరిగిన మొక్కలను తొలగించిన ..మాజీ సర్పంచ్
వెల్దండ ,అక్టోబర్ 24, పున్నమి న్యూస్:
వెల్దండ మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామం నుండి గొల్లోని పల్లి రహదారికి ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడం వలన వాహనదారులకు ప్రమాదకరంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దృష్టిలో పెట్టుకొని జెసిబి సహాయంతో తన సొంత ఖర్చులతో కుప్పగండ్ల మాజీ సర్పంచ్ ముక్తాల శేఖర్ చెట్లను తొలగించారు. బీఆర్ఎస్ నేత సేవా దృక్పథంతో స్పందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు , గొల్లోనిపల్లి గ్రామ పెద్దలు, మరియు యువకులు పాల్గొన్నారు.


