రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ
* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
నగరంలోని సిరిపురం లో గల బాలల థియేటర్ లో శుక్రవారం త పాలశాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇచ్చారు. దేశంలోని 40 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ మేళా ద్వారా 51 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. విశాఖలో 101 మంది కి కస్టమ్స్, పోస్టల్, నేవీ, రైల్వే, తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో విశాఖ ఎం పి ఎం.భరత్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వీ ఎస్ రవిశంకర్ , తపాలశాఖ సీనియర్ సూపరింటెండెంట్ గజేంద్ర కుమార్ పాల్గొన్నారు.


