Sunday, 7 December 2025
  • Home  
  • రోగులు పూర్తిస్థాయిలో కోలుకోవడంలో ఫిజియోథెరపీ వైద్యుల ది కీలక పాత్ర: డాక్టర్ రవి కృష్ణ
- Blog

రోగులు పూర్తిస్థాయిలో కోలుకోవడంలో ఫిజియోథెరపీ వైద్యుల ది కీలక పాత్ర: డాక్టర్ రవి కృష్ణ

సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ను నంద్యాల ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు,నంద్యాల ఫిజియోథెరపిస్టుల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోగుల చికిత్సలో పూర్తిస్థాయిలో కోలుకోవడంలో ఫిజియోథెరపీ వైద్యులది కీలక పాత్ర అని అన్నారు.ప్రతి వైద్య విభాగంలో ఫిజియోథెరపీ సేవల అవసరం ఉంటుందన్నారు. ఇండియన్ ఫిజియోథెరపిస్ట్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్ట్ సంఘం కన్వీనర్ డాక్టర్ రోహిణి విజయ్ మాట్లాడుతూ ఫిజియోథెరపిస్తులను అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ యాక్ట్ 2021 ప్రకారం డాక్టర్లుగా గుర్తింపునిచ్చిందని తెలిపారు.ఆపరేషన్ ముందు, తర్వాత కూడా ఫిజియోథెరపీ అవసరం అని, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం ఫిజియోథెరపీలో ఉందని తెలిపారు నంద్యాల జిల్లాకు చెందిన డాక్టర్ కాటసాని శివ బాలిరెడ్డి ఇప్పటివరకు 3 పుస్తకాలు, 10 అధ్యాయాలు జాతీయస్థాయి పుస్తకాలలో, 5 అంతర్జాతీయ జర్నల్స్ లో పరిశోధనా పత్రాలు వెలువరించారని, ఫిజియోథెరపీ రంగంతో పాటు సైకాలజీ ,సోషల్ వర్క్, డైట్ అండ్ న్యూట్రిషన్ మరియు హాస్పిటల్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలోనూ ఆయనకు ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నదని, ప్రస్తుతం సంస్కృతి యూనివర్సిటీలో పీహెచ్ డి రీసర్చ్ స్కాలర్ గా విశిష్ట పరిశోధనలను కొనసాగిస్తూ ఫిజియోథెరపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడుతూ ఈ సందర్భంగా డాక్టర్ శివ బాలిరెడ్డి ని ఘనంగా సత్కరించటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివపాలిరెడ్డి, డాక్టర్ రోహిణి విజయ్ లతో పాటు నంద్యాల ఫిజియోథెరపీస్టు వైద్యులు డాక్టర్ రామచంద్ర, డాక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ యాస్మిన్, డాక్టర్ వసుధ, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ మధు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ను నంద్యాల ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు,నంద్యాల ఫిజియోథెరపిస్టుల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోగుల చికిత్సలో పూర్తిస్థాయిలో కోలుకోవడంలో ఫిజియోథెరపీ వైద్యులది కీలక పాత్ర అని అన్నారు.ప్రతి వైద్య విభాగంలో ఫిజియోథెరపీ సేవల అవసరం ఉంటుందన్నారు.
ఇండియన్ ఫిజియోథెరపిస్ట్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్ట్ సంఘం కన్వీనర్ డాక్టర్ రోహిణి విజయ్ మాట్లాడుతూ ఫిజియోథెరపిస్తులను అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ యాక్ట్ 2021 ప్రకారం డాక్టర్లుగా గుర్తింపునిచ్చిందని తెలిపారు.ఆపరేషన్ ముందు, తర్వాత కూడా ఫిజియోథెరపీ అవసరం అని, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం ఫిజియోథెరపీలో ఉందని తెలిపారు నంద్యాల జిల్లాకు చెందిన డాక్టర్ కాటసాని శివ బాలిరెడ్డి ఇప్పటివరకు 3 పుస్తకాలు, 10 అధ్యాయాలు జాతీయస్థాయి పుస్తకాలలో, 5 అంతర్జాతీయ జర్నల్స్ లో పరిశోధనా పత్రాలు వెలువరించారని, ఫిజియోథెరపీ రంగంతో పాటు సైకాలజీ ,సోషల్ వర్క్, డైట్ అండ్ న్యూట్రిషన్ మరియు హాస్పిటల్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలోనూ ఆయనకు ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నదని, ప్రస్తుతం సంస్కృతి యూనివర్సిటీలో పీహెచ్ డి రీసర్చ్ స్కాలర్ గా విశిష్ట పరిశోధనలను కొనసాగిస్తూ ఫిజియోథెరపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడుతూ ఈ సందర్భంగా డాక్టర్ శివ బాలిరెడ్డి ని ఘనంగా సత్కరించటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివపాలిరెడ్డి, డాక్టర్ రోహిణి విజయ్ లతో పాటు నంద్యాల ఫిజియోథెరపీస్టు వైద్యులు డాక్టర్ రామచంద్ర, డాక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ యాస్మిన్, డాక్టర్ వసుధ, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ మధు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.