Sunday, 7 December 2025
  • Home  
  • రొయ్యల ఎగుమతులపై కష్టాలు – రైతుల జీవనాధారం ప్రమాదంలో
- ఆంధ్రప్రదేశ్

రొయ్యల ఎగుమతులపై కష్టాలు – రైతుల జీవనాధారం ప్రమాదంలో

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులు ప్రస్తుతం పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు రొయ్యలపై ఎక్కువ పన్నులు వేసేయడంతో చాలా ఆర్డర్లు రద్దయిపోయాయి. ఈ కారణంగా రాష్ట్రానికి దాదాపు రూ. 25,000 కోట్ల నష్టం జరిగిందని అంచనా. ఈ నష్టంతో ఎక్కువగా ఇబ్బంది పడేది రైతులే. రొయ్యల పెంపకానికి పెట్టే ఫీడ్, మెడిసిన్స్, కరెంట్ ఖర్చులు చాలా పెరిగాయి. కానీ అమ్మకానికి రేట్లు పడిపోవడంతో పెట్టుబడులు తిరిగి రావడం లేదు. కొంతమంది రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక హ్యాచరీస్, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ప్రొడక్షన్ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎగుమతులు తగ్గిపోవడంతో పోర్టు, ట్రాన్స్‌పోర్ట్ రంగాలు కూడా నష్టపోతున్నాయి. ఇప్పుడైనా ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలి. ఫీడ్, మెడిసిన్స్ కొంత సబ్సిడీ ఇవ్వాలి. ఎగుమతులు కేవలం అమెరికా మీద ఆధారపడకుండా జపాన్, చైనా, మధ్యప్రాచ్యం వంటి కొత్త మార్కెట్లు తెరవాలి. కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ సదుపాయాలు పెంచాలి. రైతుల శ్రమ వృథా కాకుండా, రొయ్యల ఎగుమతి రంగం మళ్లీ బలపడేందుకు ప్రభుత్వం – పరిశ్రమ – రైతులు కలిసి పనిచేయాలి.

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులు ప్రస్తుతం పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు రొయ్యలపై ఎక్కువ పన్నులు వేసేయడంతో చాలా ఆర్డర్లు రద్దయిపోయాయి. ఈ కారణంగా రాష్ట్రానికి దాదాపు రూ. 25,000 కోట్ల నష్టం జరిగిందని అంచనా.
ఈ నష్టంతో ఎక్కువగా ఇబ్బంది పడేది రైతులే.
రొయ్యల పెంపకానికి పెట్టే ఫీడ్, మెడిసిన్స్, కరెంట్ ఖర్చులు చాలా పెరిగాయి.
కానీ అమ్మకానికి రేట్లు పడిపోవడంతో పెట్టుబడులు తిరిగి రావడం లేదు.
కొంతమంది రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది.
ఇక హ్యాచరీస్, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ప్రొడక్షన్ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎగుమతులు తగ్గిపోవడంతో పోర్టు, ట్రాన్స్‌పోర్ట్ రంగాలు కూడా నష్టపోతున్నాయి.
ఇప్పుడైనా ప్రభుత్వం ముందుకు రావాలి.
రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలి.
ఫీడ్, మెడిసిన్స్ కొంత సబ్సిడీ ఇవ్వాలి.
ఎగుమతులు కేవలం అమెరికా మీద ఆధారపడకుండా జపాన్, చైనా, మధ్యప్రాచ్యం వంటి కొత్త మార్కెట్లు తెరవాలి.
కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ సదుపాయాలు పెంచాలి.
రైతుల శ్రమ వృథా కాకుండా, రొయ్యల ఎగుమతి రంగం మళ్లీ బలపడేందుకు ప్రభుత్వం – పరిశ్రమ – రైతులు కలిసి పనిచేయాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.