పున్నమి ప్రతినిధి
అక్టోబర్
మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామస్థాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ కలెక్టర్ సతీమణి, ప్రముఖ అడ్వకేట్ దివ్య ప్రసాద్ అన్నారు. అక్టోబర్ నెలలో పింక్ మంత్ పేరిట రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కేజీహెచ్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కే. శిల్ప ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దివ్య ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి మహిళ ఖచ్చితంగా ఏడాదికి ఒకసారి విధిగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. కేజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ రొమ్ము క్యాన్సర్ వ్యాధి పట్ల మహిళలకు విస్తృత అవగాహన కార్యక్రమం తో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేపట్టినట్లు తెలిపారు. మెమోగ్రామ్ ఇతర వైద్య పరీక్షలు కూడా కేజీహెచ్ లో ఉచితంగానే అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా నిత్యం ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రేడియాలజీ విభాగతకి డాక్టర్ కే. బుజ్జి బాబు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తిస్తేనే సకాలంలో నయం చేయవచ్చునని కేజీహెచ్ లో ఉన్న అన్ని ఉచిత సదుపాయాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మెడికల్ ఆంకాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవలతో పాటు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కే. శిల్ప దివ్య ప్రసాద్ తో పాటు కేజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ ఐ. వాణిని ఘనంగా సత్కరించారు. అనంతరం సిఎస్ఆర్ బ్లాక్ బయట గాలిలోకి పింక్ బెలూన్లు ఎగరవేశారు.


