Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

రైళ్లలో తనిఖీలు ముమ్మరం!*

Punnami Newsroom Published: Updated:
రైళ్లలో తనిఖీలు ముమ్మరం!*

Story highlights

  • *- అక్టోబర్ నెలంతా ప్రత్యేక తనిఖీలు* *- అసలు గుర్తింపు పత్రం లేకుంటే ఇబ్బందే* సూళ్లూరుపేట, అక్టోబర్ 3 (పున్నమి న్యూస్): రైళ్లలో టికెట్ తనిఖీలను రైల్వే అధికారులు ముమ్మరం చేశారు.
  • టికెట్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతోపాటు రాయితీలు, ప్రత్యేక రిజర్వేషన్ కోటాలను అర్హులైన ప్రయాణికులే వినియోగించేలా తనిఖీలు చేపడుతున్నారు.
  • అక్టోబర్ 1 నుంచి 31 వరకు సెంట్రల్ రైల్వే పరిధిలోని రైళ్లు, స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు.

*- అక్టోబర్ నెలంతా ప్రత్యేక తనిఖీలు*
*- అసలు గుర్తింపు పత్రం లేకుంటే ఇబ్బందే*

సూళ్లూరుపేట, అక్టోబర్ 3 (పున్నమి న్యూస్): రైళ్లలో టికెట్ తనిఖీలను రైల్వే అధికారులు ముమ్మరం చేశారు. టికెట్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతోపాటు రాయితీలు, ప్రత్యేక రిజర్వేషన్ కోటాలను అర్హులైన ప్రయాణికులే వినియోగించేలా తనిఖీలు చేపడుతున్నారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకు సెంట్రల్ రైల్వే పరిధిలోని రైళ్లు, స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. రాయితీ టికెట్లు, నిర్దిష్ట రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాసులు, ఈ-పాస్ లు, పీఓటీలపై ప్రయాణించే వారి వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

రాయితీ లేదా ప్రత్యేక కోటా కింద ప్రయాణించే వారు తమ అర్హతను నిర్ధారించే అసలు గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఒకే టికెట్ పై పలువురు ప్రయాణిస్తున్న సందర్భంలో టికెట్ లో పేరున్న ప్రయాణికుల్లో కనీసం ఒకరు నిర్దేశిత అసలు గుర్తింపు పత్రాన్ని చూపించాలి. అది చూపించలేని పక్షంలో వర్తించే రైల్వే నిబంధనల ప్రకారం ఆ టికెట్ పై ప్రయాణిస్తున్న వారిని చెల్లుబాటు అయ్యే టికెట్ లేనివారిగా పరిగణించే అవకాశం ఉంది. ఈ-పాస్, పీఓటీపై ప్రయాణించే వారు కూడా అసలు గుర్తింపు పత్రంతోపాటు ప్రయాణానికి అవసరమైన అనుమతి ప్రక్రియ పూర్తయిందో లేదో నిర్ధారించుకోవాలి. రిజర్వేషన్ లేని టికెట్లను సైతం తనిఖీ చేయనున్నారు.

టికెట్ లేకుండా లేదా చెల్లుబాటు కాని టికెట్ తో ప్రయాణించే వారిపై నిబంధనల మేరకు అదనపు రుసుము, జరిమానా విధించనున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారికి విధించే కనీస అదనపు రుసుము రూ.250 నుంచి రూ.500కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రైలు ఎక్కే ముందే టికెట్ వివరాలను సరిచూసుకోవడంతోపాటు అవసరమైన అసలు గుర్తింపు పత్రాలను వెంట ఉంచుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *