ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామం లోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎన్ఎఫ్ఐఆర్ అండ్ ఎస్ సిఆర్ఈఎస్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య పిలుపు మేరకు గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్ షాపు గేటు వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ, బ్రాంచ్ కార్యదర్శి గద్దా సురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ, కార్మికుల న్యాయపరమైన కోర్కెలను తీర్చకుండా తుంగలో తొక్కి కాలయాపన చేస్తుందని విమర్శించారు. దీనివల్ల భవిష్యత్ తరాల కార్మిక లోకానికి మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 8వ పే కమిషన్ ను వెంటనే నియమించాలని, కేడర్ రీష్ప్యరింగ్ అమలు చేయాలని, రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి కార్మికుల పై పనిభారాన్ని తగ్గించాలని, రైల్వే ఉద్యోగులందరికీ ఓపిఎస్ ను అమలు పరచాలని, రైల్వేల ప్రవేటికరణను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి బ్రాంచి అధ్యక్షుడు పామర్తి శివనాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. వర్కింగ్ చైర్మన్ దాసరి డేవిడ్ రాజు, కోశాధికారి పి.విమల్ సాయి, గూడవల్లి సుధాకర్, ఎస్.బోయాజ్, కె.ఎల్.నాయక్, ఎం.డి.రబ్బానీ, ఆర్.ఎన్.మద్ధయ్య, కునిబిల్లి శంకరరావు, మహిళా కార్మికులు, బ్రాంచి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

*రైల్వే వ్యాగన్ వర్క్ షాపు ఎదుట ఎంప్లాయీస్ సంఘ్ ధర్నా*