పున్నమి ప్రతి నిధి
దేశంలో పెరుగుతున్న మధుమేహ రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రైల్వే బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు “డయాబెటిక్ మీల్” ఆప్షన్ను కూడా ముందుగానే సూచించవచ్చు. ఈ ఆప్షన్ను ఎంచుకున్న వారికి చక్కెర, కొవ్వు తక్కువగా ఉండే ప్రత్యేక భోజనం అందించనుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు ప్రకటించింది.


