రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి – శంకర్పల్లి వద్ద హల్చల్.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో ఓ యువతి రైల్వే ట్రాక్‌పై కారు నడిపి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. గేట్ నంబర్ 20 వద్ద నాగులపల్లి నుంచి శంకర్పల్లి వైపు కారు నడిపుతూ వెళ్తుండగా, స్థానికులు ఆపేందుకు ప్రయత్నించగా ఆమె చాకుతో బెదిరించారు. సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు వెంటనే స్పందించి కారును ట్రాక్‌పై నుంచి తప్పించి యువతిని అదుపులోకి తీసుకున్నారు.

