Tuesday, 24 March 2026
  • Home  
  • రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమం
- అన్నమయ్య

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమం

రైల్వే కోడూరు, సెప్టెంబర్ 20: రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించడం సంతోషకరం. కళాశాలను హరితంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత. నాటిన ప్రతి చెట్టును సంరక్షించాలి” అని పేర్కొన్నారు. కోఆర్డినేటర్ డాక్టర్ కె. రమేష్ పచ్చని వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే మాట్లాడుతూ, “భవిష్యత్ తరాలకు శుభ్రమైన గాలి కావాలంటే చెట్లను కాపాడుకోవాలి” అని అన్నారు. తరువాత ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

రైల్వే కోడూరు, సెప్టెంబర్ 20:
రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించడం సంతోషకరం. కళాశాలను హరితంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత. నాటిన ప్రతి చెట్టును సంరక్షించాలి” అని పేర్కొన్నారు. కోఆర్డినేటర్ డాక్టర్ కె. రమేష్ పచ్చని వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే మాట్లాడుతూ, “భవిష్యత్ తరాలకు శుభ్రమైన గాలి కావాలంటే చెట్లను కాపాడుకోవాలి” అని అన్నారు. తరువాత ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.