రైల్వే కోడూరు నియోజకవర్గం*
*షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి
కోడూరు పట్టణం పగడాల పల్లి కి చెందిన షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారి స్వగృహం వద్ద *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* అందజేశారు.
*ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ*, “ప్రజల కష్టసమయంలో ప్రభుత్వం అండగా ఉండటం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక కుటుంబాలకు చేయూత అందిస్తున్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వం సహాయం చేరేలా కృషి చేస్తున్నాం” అన్నారు.
*ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ*, “సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజల ఆరోగ్య భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. ఈ సహాయం బాధిత కుటుంబాలకు మానసిక ధైర్యం, ఆర్థిక బలాన్ని అందిస్తుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ జుబేర్ మరియు NDA కూటమి నేతలు పాల్గొన్నారు.


