రైల్వే కోడూరు, అక్టోబర్ 06:( పున్నమి ప్రతినిధి)
రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సూపర్ జి.ఎస్.టి. 2.0 అనే అంశంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు.ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ, “జి.ఎస్.టి. భారం ప్రజలపై పడకూడదు అన్న ఉద్దేశ్యంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం సమాజానికి ప్రయోజనకరమైంది” అని పేర్కొన్నారు.కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. సుబ్రమణ్యం రాజు గారు జి.ఎస్.టి. పుట్టుక, దాని ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


