సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 78 రోజుల వేతనాన్ని ‘ఉత్పాదకతతో ముడిపడిన బోనస్’ (PLB) రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందిరైల్వే పనితీరును మెరుగుపరిచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుందని రైల్వే మంత్రి తెలిపారు. 78 రోజుల బోనస్ అయినా చెల్లింపులపై పరిమితి వల్ల ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 మాత్రమే లభించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే 1614.90 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేపట్టగా.. 730 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది.

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 78 రోజుల వేతనాన్ని ‘ఉత్పాదకతతో ముడిపడిన బోనస్’ (PLB) రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందిరైల్వే పనితీరును మెరుగుపరిచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుందని రైల్వే మంత్రి తెలిపారు. 78 రోజుల బోనస్ అయినా చెల్లింపులపై పరిమితి వల్ల ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 మాత్రమే లభించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే 1614.90 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేపట్టగా.. 730 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది.

